మే 20న జరిగిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజునాడు హడావిడి చేయాలని భావించిన తారక్ అభిమానులకు ఆరోజు ఒక పీడకల లా మారిపోయింది అన్న బాధ జూనియర్ అభిమానులలో బాగా కనిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అభిమానులు నెలల తరబడి ఎదురు చూసిన ‘వార్ 2’ టీజర్ ఏమాత్రం సంతృప్తి పరచలేకపోయింది అన్న సంకేతాలు వస్తున్నాయి. 

‘వార్ 2’ టీజర్ ‘బాహుబలి’ ‘కేజీ ఎఫ్’ రేంజ్ లో ఉంటుందని తారక్ అభిమానులు భావిస్తే విడుదలైన ఆటీజర్ తారక్ అభిమానుల ఆశల పై నీళ్ళు జల్లింది. వాస్తవానికి ఈ మూవీ టీజర్ పై ఎన్నో అంచనాలు అభిమానులు పెట్టుకోవడంతో విడుదలైన ఆ టీజర్ చూసి సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ సెటైర్లు చూసి ఈ మూవీ దర్శక నిర్మాతలు షాక్ అవ్వడంతో తారక్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని మరొక పవర్ ఫుల్ ట్రైలర్ ను విడుదల చేసి ఈమూవీ పై అంచనాలు పెంచాలని ఈమూవీ నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి తమ హీరో పుట్టినరోజు కాబట్టి విడుదలైన ‘వార్ 2’ టీజర్ లో తమ హీరో ఎలివేషన్ ఎక్కువగా ఉంటుందని అభిమానులు భావించారు. దీనికితోడు ఈ టీజర్ లో జూనియర్ కంటే హృతిక్ రోషన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లుగా యంగ్ టైగర్ అభిమానులు భావిస్తున్నారు. అదేవిధంగా తమ హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆ టీజర్ లో కనీసం తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆమూవీ నిర్మాతలు చెప్పకపోవడం అభిమానులకు మరింత షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.   

అదేవిధంగా ఈ టీజర్ లో విఎఫెక్స్ లో హడావిడి కనిపించింది కానీ  కొన్ని విజువల్స్ లో క్వాలిటీ లోపించింది అని అభిమానులు భావిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తారక్ లుక్స్ ని సరిగా డిజైన్ చేయకపోవడంతో పాటు తన వాయిస్ ఓవర్ తో హృతిక్ కి ఎలివేషన్ ఇప్పించడం అభిమానులకు మరింత షాక్ ను ఇచ్చినట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: