
ఎప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. తన సినిమా హరిహర వీరమల్లు విడుదల ఉంది అని తెలిసి కూడా ఎగ్జిబిటర్లు .. డిస్ట్రిబ్యూటర్లు కలిసి థియేటర్ల బంద్ కోసం ఉద్యమం ప్రారంభించడం ఆయనకు అసలు నచ్చలేదు. నిజానికి వాళ్లు ఉద్యమించడం తప్పు కాదు .. కానీ ఉద్యమించిన టైమ్ తప్పు. అది కూడా పవన్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటించాక కూడా వీరు బంద్ డేట్ వేసి తెర వెనక ఉండి కథ నడిపిస్తున్నారు అంటే వీళ్లు పవన్ నే టార్గెట్ చేసినట్టు క్లీయర్ గా తెలుస్తోంది. బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు .. బంద్ వద్దు అని నిర్మాతల సమావేశం నిర్ణయాలు ప్రకటించారు. చివరికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టాలీవుడ్ లో నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు అందరూ ఒక్కరే ఉంటారు .. అందులోనూ ఆ నలుగురే ఉంటారు.
ఇక్కడ నిజమైన ఎగ్జిబిటర్లు గట్టిగా 10 నుంచి 20 మంది కూడా ఉండరు. ఏం చేసినా ఆ నలుగురు కలిసి తెరవెనక కథ నడిపిస్తారు. అసలు ఈ బంద్ కు బీజం పడింది తూర్పుగోదావరి జిల్లాలో ..! దీనికి ప్రధాన కారణం కూడా అక్కడ ఓ వైసిపి మాజీ ఎమ్మెల్యే తో కలిసి ఆ నలుగురులో కొందరు ఈ కుట్రకు తెర లేపారు అన్న అనుమానాలు కూడా వచ్చాయి. చివరకు జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ రంగంలోకి దిగి దీనిపై విచారణ చేయాలన్నారు. పవన్ ఏకంగా రంగంలోకి తిరిగి టాలీవుడ్కు వార్నింగ్ ఇస్తూ ఓ లేఖ విడుదల చేయడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఆ నలుగురు దొంగలు గప్చుప్ అయిపోయారు. బంద్ అంతా తూచ్ అయిపోయింది. ఈ బంద్ తో మాకు సంబంధం లేదు అసలు ఇది ఎలా వచ్చిందో మాకు తెలియదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కటం ప్రారంభించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు