ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ పరిరక్షణ కొరకు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవీ హర్షకుమార్. దీనిలో భాగంగానే మార్చి మూడో తేదీన చలో ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్నట్టు ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. యూనివర్సిటీ యొక్క పరిరక్షణకు ఉద్యమిస్తామని, ఆంధ్ర యూనివర్సిటీ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అవసరం ఉందని ఆయన తెలియజేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేసినటువంటి వారికి మాత్రమే యూనివర్సిటీలో పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేశారు.

 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెడ్డి సంఘం మీటింగుకు వెళ్లడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని అశోక్ కుమార్ అన్నారు. అలాగే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగిని రిజిస్ట్రార్ గా పెట్టిన చరిత్ర ఇప్పటి వరకు ఏ ఒక్క  యూనివర్సిటీలో లేదని ఆయన కడిగిపారేశారు. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలపై ప్రశ్నిస్తామని అన్నారు. అయితే తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వేసిన అభివృద్ధి కమిటీ ఇప్పటివరకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ పై పోరాడేది కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాష్ట్రంలో మనుగడ సాధ్యం కాదని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలియజేశారు. ఈ విధంగా ఆంధ్ర యూనివర్సిటీ గొడవ ఏపీలో చాలావరకు చెలరేగుతుందని చెప్పవచ్చు. అలాగే యూనివర్సిటీ కి సంబంధించి టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో ఆంధ్ర యూనివర్సిటీ పోస్టర్ను ఆవిష్కరించారు

అని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు జగదీష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో అప్రజాస్వామిక, అరాచక పాలనకు వ్యతిరే కంగా మార్చి 3వ తేదీన తలపెట్టిన చలో ఆంధ్ర యూని వర్సిటీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన ప్రసాద్ రెడ్డి తక్షణమే రికాల్ చేయాలని అఖిలపక్షం తల పెట్టినటువంటి చలో ఆంధ్ర యూనివర్సిటీ ఈ కార్యక్ర మాన్ని హిందూపురం పార్లమెంట్ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: