పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నేతలపై జగన్మోహన్ రెడ్డి పట్టు జారిపోతోందా అనే సందేహం పెరిగిపోతోంది. నేతలమధ్య పంచాయితీలు పెరిగిపోయి రోడ్డున పడుతున్నారు. వీళ్ళమధ్య ఆధిపత్యగొడవలతో చివరకు జగన్ పరువు తీసేస్తున్నారు. ప్రత్యర్ధివర్గాలను జగన్ పిలిచి పంచాయితీ చేసిన తర్వాత కూడా గొడవలుపడుతునే ఉన్నారంటే అర్ధమేంటి ? జగన్ మాటంటే లెక్కలేదనే కదా ?  అధినేత మాటను కూడా నేతలు లెక్కచేయటం లేదంటే కారణం జగన్ కు పార్టీపై పట్టుసడులుతోందని నేతలు అనుకోవటమే.




ఇందుకు తాజా ఉదాహరణ నెల్లూరు సిటీలోని రెండువర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రోడ్డున పడటమే. మాజీమంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనీల్ కుమార్ యాదవ్ కు ఆయన బాబాయ్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యుటి మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు ఏమాత్రం పడటంలేదు. మొదట్లో ఇద్దరు బాగానే ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో బద్ధశతృవులుగా మారిపోయారు. పదిరోజుల క్రితమే నెల్లూరు పర్యటనలో ఇద్దరితో జగన్ మాట్లాడి సయోధ్య కుదిర్చి షేక్ హ్యాండ్ ఇప్పించారు. అయితే జగన్ జిల్లా దాటగానే మళ్ళీ గొడవలు పడుతున్నారు.





ఆమధ్య వరకు మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి కూడా అనీల్ తో పడలేదు. ఇదేవిధంగా గొడవలుపడేవారు. ఇద్దరినీ పిలిచి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటంతో గొడవలు సద్దుమణిగాయి. ఇక గన్నవరంలో కూడా ఇదే పద్దతి. టీడీపీ నుండి వచ్చిన ఎంఎల్ఏ వల్లభనేని వంశీతో సీనియర్ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుకు ఏమాత్రం పడటంలేదు. వీళ్ళమధ్య జగన్ రెండుమూడుసార్లు పంచాయితి చేసినా గొడవలు ఆగటంలేదు.




కడప జిల్లా ప్రొద్దూటురులో ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఎంఎల్సీ రమేష్ యాదవ్ కు గొడవలు జరుగుతున్నాయి.  రెండువర్గాలు ఒకళ్ళపై మరొకళ్ళు దాడులుచేసుకుని పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేసుకునే దాకా వెళ్ళాయి. వీళ్ళిద్దరినీ జగన్ పిలిచి మాట్లాడితే ఓకే అంటారు తర్వాత నియోజకవర్గానికి చేరుకోగానే మళ్ళీ గొడవలు పడుతుంటారు. హిందుపురం, మడకశిరలో పార్టీలోని ప్రత్యర్ధివర్గాల మధ్యా ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ప్రతిరోజు జగన్ను టార్గెట్ చేస్తు నానా రచ్చచేస్తుంటే మరోవైపు పార్టీలోని వైరివర్గాలు ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: