ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో చిరంజీవి తనపై పెట్టిన కేసును తానే వాదించుకొని గెలుస్తాడు. అది చూసి జనం నిజ జీవితంలో కూడా కోర్టు అంటే ఇలానే ఉంటుంది అనుకొని పొరబడుతుంటారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకి కూడా ఈ విషయం తెలియదా..
వాస్తవానికి ఒక వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత అతడిని న్యాయస్థానం ముందు హాజరు పరుచుతారు. ఆ సమయంలో నువ్వు తప్పును అంగీకరిస్తున్నావా అని న్యాయమూర్తి అడిగితే బదులుగా నేనేం తప్పు చేయలేదు అని అతను సమాధానమిస్తాడు. అప్పుడు న్యాయవాదిని పెట్టుకొని కేసును వాదించుకోండి అని కోర్టు చెప్తోంది. ఇది ప్రక్రియ.


చంద్రబాబు విషయానికొస్తే తన కేసును తానే వాదించుకున్నారు అని మీడియాలో ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆ సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తో పాటు సీనియర్ న్యాయవాదులు కోర్టులోనే ఉన్నారు. అప్పుడు చంద్రబాబు చేసింది వాదన కాదు. తన పాయింట్‌ను చెప్పారు. రెండో సారి రిమాండ్ పొడగించే సమయంలో నిందితుడికి ఏ సంబంధం ఉండదు. ఒకవేళ ఏదైనా ఉంటే కోర్టులో అతని లాయర్లు వాదించాలి. కానీ ఎల్లో మీడియాలో మాత్రం చంద్రబాబు అంశం ప్రస్తావన లేకుండా వార్తలే రావడం లేదు. గంటకోసారి బ్రేకింగ్‌ న్యూస్ లో చంద్రబాబు వాళ్లతో మాట్లాడారు. ఈ అంశంపై చర్చించారు అంటూ తాజా వార్తలు వస్తూనే ఉన్నాయి.


రిమాండ్ విషయంలో చంద్రబాబుని వర్చువల్ పద్ధతిలో ప్రవేశపెట్టారు.  ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలను ఎల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు. ఏ తప్పు చేయకున్నా అరెస్టు చేశారు. జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అని. కానీ ఈ విషయంలో చంద్రబాబు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పార్టీని సంక్షోభం నుంచి కాపాడుకోవడానికి తనకు తాను త్యాగం చేసుకొని  ముందు చూపుతో వెళ్తున్నారు. ఈ సందర్భంలో న్యాయస్థానం దీనిని మీరు శిక్షగా భావించొద్దు అని ఆయనకు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: