తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నియామక ప్రక్రియలో లోటుపాట్లతో పాటు, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు సూచిస్తూ నివేదికలు ఇవ్వాలని సీఎం రేవంత్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా, అవకతవకలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలీసు నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ ఆదేశించారు. 

పోలీసు, వైద్యారోగ్య శాఖలో నియామకాలతో పాటు పోలీసు, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏడెనిమిదేళ్లుగా నిలిచిపోయిన హోంగార్డుల నియామకాలను వెంటనే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణలో హోంగార్డుల సేవలను మరింత వినియోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల ఆర్థిక, ఆరోగ్య అవసరాలు తీరేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: