
అయితే ఇప్పటివరకు ఇలా మద్యానికి బానిసగా మారిపోయిన మందుబాబులను ఎంతోమందిని చూసే ఉంటారు. మద్యానికి బానిసగా మారిపోయిన కుక్క గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా అతను ఎంతో ప్రేమగా కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే ఇలా కుక్కను పెంచుకుంటున్నప్పుడు దానికి అన్నం లేదా పెడిగ్రీ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం ప్రతిరోజు ఆ కుక్కకి మద్యం తాగించడం మొదలుపెట్టాడు. దీంతో అతనితో పాటు అతని పెంపుడు కుక్క కూడా మద్యానికి బానిసగా మారిపోయింది.
ఈ ఘటన బ్రిటన్ లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. బ్రిటన్ కు చెందిన వ్యక్తి పెంపుడు కుక్క కోకోకి ఆహారానికి బదులు అటు మద్యం అలవాటు చేసాడు. దీంతో ఆ పెంపుడు కుక్క ఇప్పుడు మద్యానికి బానిసగా మారి పోయి మందు లేకపోతే విలవిలలాడి పోతుంది. కొన్ని రోజుల క్రితమే యజమాని చనిపోగా ఇక దానికి మద్యం దొరక్కుండా పోయింది. దీంతో ఇక ఆ శునకం ఆరోగ్యం కూడా పాడైంది. దీంతో స్థానికులు దాన్ని యానిమల్ రెస్క్యూ ట్రస్ట్ కు అప్పగించడంతో డాక్టర్ చికిత్స అందించి కాపాడారు అని చెప్పాలి. ఇక మధ్యానికి బానిసై కోలుకున్న తొలి కుక్కగా కోకో నిలిచింది అని చెప్పాలి.