
నిజానికి సీఎం జగన్ ఇలా.. ఎవరో చెబితే.. చేసే టైపు కాదనేది అందరికీ తెలిసిందే. అభ్యర్థుల ప్రవర్తన.. వారికి పార్టీతో ఉన్న అనుబంధం.. వైఎస్ కుటుంబం విషయంలో వారు ఎలా ఉన్నారు ? వంటి కీలక విషయాలను.. పరిగణనలోకి తీసుకుని.. మంత్రి వర్గ కూర్పు చేస్తుంటారు. గతంలో ఇలానే జరిగింది. కానీ, ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా.. నెల్లూరు జిల్లాలో ఒక రెడ్డి నాయకుడుకు చెందిన ఆన్‌లైన్ చానెల్లోనూ.. ఇదే తరహా ప్రచారం జరుగుతోంది.
ఆయన ఎవరు అనేది ఎవరూ చెప్పడం లేదు.కానీ.. సీఎం జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు అని మాత్రం అంటున్నారు. అంతేకాదు.. మంత్రి పదవులకు రేటు కూడా కట్టారని చెబుతున్నారు. ఒక్కొక్క మంత్రిసీటుకుకోట్లలోనే ఆయన డిమాండ్ చేస్తున్నారని.. ఈ ప్రచారంలో ఉండడం గమనార్హం. నిజానికి ఇది వికృత ప్రచారమని నెల్లూరు జిల్లా కు చెందిన నాయకులే మండి పడుతున్నారు.
మంత్రి పదవిని ఆశించి.. తమకు దక్కే అవకాశం లేదని.. అనుకుంటున్న వారు ఇలా విష ప్రచారంచేస్తున్నారని పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఇలాంటి చర్యలను సీఎం జగన్ ఎట్టి పరిస్థితిలోనూ ప్రోత్సహించరని తెలిసి కూడా ఇలాంటి ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? నిజంగానే ఆ నేత ఉన్నాడా? లేక కల్పిత కథనమా? అనే కోణంలో వైసీపీ నాయకులు సీరియస్‌గానే చర్చించుకుంటున్నారు.