
2 టీస్పూన్లు నిమ్మరసం + 4 టీస్పూన్లు పెరుగు కలిపి తలకు రాయాలి. 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. వారం లో ఒకసారి చేయండి.పెరుగు + మెంతి పొడి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లు తగ్గించి శీతలత ఇస్తుంది. జుట్టు వృద్ధికి సహాయపడుతుంది. 2 టేబుల్ స్పూన్లు మెంతి పొడి + 3 టేబుల్ స్పూన్లు పెరుగు కలిపి ముద్దలా చేయాలి. తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడగాలి. వారం లో ఒకసారి చేయండి. జుట్టు వేగంగా పెరుగుతుంది. స్కాల్ప్ కు పోషణ అందుతుంది. డ్రై హేయిర్ కి మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
2 టీస్పూన్లు ఆముదం నూనె + 3 టీస్పూన్లు పెరుగు కలిపి తలకు మర్దన చేయాలి. అరగంట తర్వాత కడగాలి పెరుగు + అల్లం రసం, డాండ్రఫ్ తగ్గుతుంది. స్కాల్ప్ కు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. జుట్టు రూట్లను బలపరుస్తుంది. 1 టీస్పూన్ అల్లం రసం + 2 టీస్పూన్లు పెరుగు కలిపి తలకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడగాలి. జుట్టు పొడిగా మారిన వారికి తేమనిస్తుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. తల చర్మానికి పోషణ కలుగుతుంది. అరటి ముక్కలు ముద్ద చేయండి. అందులో 3 టీస్పూన్లు పెరుగు కలిపి తలకు రాయండి. 30 నిమిషాల తర్వాత కడగండి.