టాలీవుడ్ లో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న హీరో ఇక టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు కానీ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.. తొలి సినిమా ఉయ్యాలా జంపాల తో ఎవరీ కుర్రాడు ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అనుకున్నారు. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ తో సాలిడ్ హిట్ కొట్టి కుర్రాడు మంచి పోటీ ఇచ్చేలా ఉన్నాడు అనుకున్నారు.. ఇక కుమారి 21F తో కుర్రాడు కాదు టాప్ హీరో అవుతాడు అన్నారు.. కానీ సరిగ్గా మళ్ళీ మూడు సినిమాలు చేశాక కానీ రాజ్ తరుణ్ స్టఫ్ ఏంటో తెలుసుకోలేకపోయారు..

వచ్చిన హిట్ ని సద్వినియోగం చేసుకోలేక చెత్త సినిమాలు చేసి వచ్చిన స్టార్ డమ్ ని చేజేతులా పోయేలా చేసుకున్నాడు.. ఇక తాజాగా అయన చేసిన ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా అనుకున్నట్లు ఫ్లాప్ కావడంతో రాజ్ తరుణ్ ని కాపాడే దర్శకుడు ఎవరు లేరా అనుకున్నారు.. వాస్తవానికి ఒరేయ్ బుజ్జిగా సినిమా ని OTT లో రిలీజ్ చేయకుండా ఉండాల్సింది అన్నది అయన అభిమానుల మాట..

ఒరేయ్ బుజ్జిగాపై ముందు నుంచీ రాజ్ త‌రుణ్ మంచి న‌మ్మ‌కంతో ఉన్నాడు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా – అడ్డుకున్న‌ది త‌రుణే. `సినిమాని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేద్దాం` అని ప‌ట్టుబ‌ట్టాడు. అయితే.. నిర్మాత‌కి మాత్రం ఓటీటీలో విడుద‌ల చేయ‌డం త‌ప్ప‌లేదు. తీరా చూస్తే… రాజ్ త‌రుణ్ ది కాన్ఫిడెన్స్ కాదు, ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అని తేలింది. ఈ సినిమా ఓటీటీలోనూ ప‌ల్టీ కొట్టేసింది. ఇదే సినిమా థియేట‌ర్లో విడుద‌లైతే.. నిర్మాత భారీ న‌ష్టాలు చ‌వి చూసేవాడు. ఒకవేళ ఒరేయ్ బుజ్జిగా సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే రాజ్ తరుణ్ తో చేయడానికి ఏ నిర్మాత ముందుకు వచ్చేవాడు కాదు.. ఓ రకంగా చెప్పాలంటే.. రాజ్ త‌రుణ్ తొంద‌ర‌ప‌డ్డాడు. రాజ్ త‌రుణే కాదు. నిర్మాత ప‌రిస్థితీ అంతే. `ఒరేయ్ బుజ్జిగా`కి ఓటీటీ ఆఫ‌ర్లు రావ‌డం చూసి, ఈ సినిమా హిట్ట‌వుతుంది భావించిన ఓ ఎన్ ఆర్ ఐ ప్రొడ్యూస‌రు, ఆఘ‌మేఘాల మీద సినిమాని మొద‌లెట్టారు. తీరా చూస్తే… `ఒరేయ్ బుజ్జిగా` ఫ్లాప‌య్యింది. ఇప్పుడు రాజ్ త‌రుణ్ త‌దుప‌రి సినిమాకి ఈ మాత్రం ఓటీటీ రేటు రావ‌డం కూడా క‌ష్టంగానే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: