డార్లింగ్ ప్రభాస్ తో యువ భామ పూజా హెగ్డే తొలిసారిగా కలిసి నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఎంతో విభవంగా భారీ వ్యయంతో తెరకెక్కించిన రాధేశ్యామ్ మూవీ మరొక రెండు రోజుల్లో భారీ ఎత్తున అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది.
ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, అన్ని కూడా మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసాయి. ప్రేమకి విధికి మధ్య జరిగిన యుద్ధంలో చివరికి ఏమి జరిగింది ప్రేమ గెలిచిందా లేదా అనే విభిన్న కథాంశంతో రొమాంటిక్ యాక్షన్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు సమాచారం. వాస్తవానికి బాహుబలికి ముందే దర్శకుడు రాధ తనకు ఈ స్టోరీ చెప్పారని, అయితే అప్పటి నుండి స్టోరీ, స్క్రిప్ట్ పై బాగా వర్క్ చేసిన రాధా ఫైనల్ గా 2019లో దీనిని పట్టాలెక్కించారని, సినిమాలోని ప్రతి అంశం తనకు ఎంతో నచ్చిందని, తప్పకుండా మూవీ విజయవంతం అవుతుందని తమ యూనిట్ మొత్తానికి నమ్మకం ఉన్నట్లు ఇటీవల ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు రాధాకృష్ణ కూడా పలు మీడియా సంస్థలకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.

అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ, రాధేశ్యామ్ రెండు జన్మల కథ అని, అలానే టైటానిక్ మాదిరిగా మూవీ సాగుతుందని కొంత ప్రచారం జరుగుతుందని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు, తమ సినిమాలో కూడా టైటానిక్ మాదిరిగా షిప్ ఉంటుందని, అయితే ఆ సినిమా కథతో మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదని, రెండూ పూర్తిగా వేరు వేరు అని అన్నారు, ఇక ఈ సినిమా రెండు జన్మల కథ కాదని, పక్కాగా ఒక జన్మలో హీరో, హీరోయిన్స్ లైఫ్ లో జరిగే కథ అని, సినిమాలోని కొన్ని మలుపులు అందరి హృదయాలు తాకుతాయని దర్శకుడు రాధా సమాధానం ఇచ్చారు. మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన రాధేశ్యామ్ మూవీ రేపు రిలీజ్ తరువాత ఎంత మేర కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: