
ఇకపోతే ఇటీవల రౌడీ రోహిణి అంటూ ఏకంగా లేడీ కమెడియన్ రోహిణి కూడా జబర్దస్త్ లో టీం లీడర్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ టీమ్ లీడర్ గా నిలదొక్కుకుంటుంది. కాగా ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీం లీడర్ రోహిణి. జబర్దస్త్ జడ్జ్ గా ఉన్న రోజా పూర్ణ తో పాటు యాంకర్ రష్మీ ని కూడా స్టేజి మీదికి పిలుస్తుంది రోహిణి. అయితే ఇక ఈటీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కాన్సెప్ట్ ని జబర్దస్త్ లో స్పూఫ్ చేసి చూపించింది.
ఈ క్రమంలోనే తెల్ల వెంట్రుకలు నల్లగా మారడానికి ఎంత టైం పడుతుంది అంటూ ఒక ప్రశ్న అడుగుతుంది రోహిణి. రష్మి ఎంత టైం పడుతుంది అంటూ రోజా రష్మీ ని అడుగుతుంది. నన్ను ఎందుకు అడుగుతున్నారు మేడం అని అడగగా.. నువ్వే కదా ఒక్కో ఎపిసోడ్ కి మధ్యలో మూడు గంటల పాటు రూమ్ కి వెళ్తావ్ అంటూ పంచ్ వేస్తుంది రోజా. దీంతో అందరు నవ్వుకుంటారూ. ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన సుమ అభిమానులను జబర్దస్త్ కార్యక్రమం లో కూడా మా అభిమాన యాంకర్ సుమ హవా కొనసాగుతుంది అని ఎంతో ఆనంద పడిపోతున్నారు ..