
ప్రశాంత్ నీల్ తీసింది ఇప్పటివరకు మూడే మూడు సినిమాలు. అందులో రెండు 'కెజిఎఫ్' సీరీస్ నుంచే వచ్చాయి. కానీ ఈ తక్కువ సినిమాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అవుట్ అండ్ యాక్షన్ మూవీస్‌తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారాడు. తెలుగు హీరోలైతే ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేయడానికి పోటీలు పడుతున్నారు. కథలేకుండానే కాల్షీట్స్ ఇస్తామంటున్నారు.
శంకర్ సినిమాలకి సౌత్ ఇండియాలో ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. భారీ సినిమాలు, టెక్నికల్ వండర్స్ తీస్తాడనే పేరుంది. అందుకే ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి హిందీ స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ అయితే శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ముంబయి నుంచి చెన్నైకి వచ్చాడు. కానీ '2.ఓ' ఫ్లాప్‌తో శంకర్ బ్రాండ్ వాల్యూకి బీటలు వారాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్‌తో ఒక సినిమా తీస్తున్నాడు.
'డంకీ' అనౌన్స్‌మెంట్ టీజర్ వచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ బాద్‌షా ఏంటి.. సినిమా కోసం.. రాజ్ కుమార్ హిరాణీని అంత బ్రతిమలాడ్డం ఏంటని విస్తుపోయారు. అయితే అక్కడ షారుఖ్ అయితే ఇక్కడ హిరాణీ. పవర్‌ఫుల్ స్టోరీస్‌తో బాక్సాఫీస్‌ని మెప్పించే క్రియేటివ్ మేకర్. అందుకే రాజ్‌కుమార్ హిరాణీతో సినిమాలు చేయడానికి టాప్ స్టార్స్ కూడా ఎదురుచూస్తుంటారని చెప్పొచ్చు.
కమల్ హాసన్ చాలాకాలం తర్వాత హిట్ కొట్టిన సినిమా 'విక్రమ్'. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకి రిలీజైన ప్రతీ చోటు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. వసూళ్లు కూడా భారీగానే దక్కుతున్నాయి. ఇక ఈ రిజల్ట్ చూసి కమల్ హాసన్ పండగ చేసుకుంటున్నాడు. అందరికీ గిఫ్టులు పంచుతున్నాడు. ఇక కమల్ ఫ్యాన్స్ అయితే లోకేష్ కనగరాజ్‌ని ఆకాశానికెత్తుతున్నారు.
'విక్రమ్'తో కమల్ హాసన్ చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టినా, జనాలంతా కమల్ కంటే లోకేష్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. సూపర్ మేకింగ్.. యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇద్దరికీ టఫ్ కాంపిటీటర్ అవుతాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.