ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు ఏం మాయ చేసావే మూవీ తర్వాత వరుస అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి అతి తక్కువ కాలంలోనే ఎదిగిపోయింది. ప్రస్తుతం కూడా సమంత తెలుగు లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అనేక  మూవీ లలో నటించిన సమంత తమిళ ప్రేక్షకుల మనస్సు కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే సమంత తాజాగా హిందీ లో పాపులర్ షో అయినటు వంటి కాఫీ విత్ కరణ్ లో గెస్ట్ గా పాల్గొంది. అందులో భాగంగా సమంత ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఈ షో లో భాగంగా సమంత కు రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు అనే ప్రశ్న ఎదురైంది.

సమంత 'ఓ జి' అంటూ సమాధానం ఇచ్చింది. అయితే ఈ ఓ జి అంటే రామ్ చరణ్ ఒక ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ అదిరే ట్యాగ్ ని సమంత , రామ్ చరణ్ కి ఇచ్చింది. ఇది ఇలా ఉంటే సమంత , రామ్ చరణ్ కాంబినేషన్లో రంగస్థలం సినిమా తెరకెక్కింది. రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే రంగస్థలం మూవీ లో వీరిద్దరి జంట కు  ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అదిరిపోయే ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: