ఒక సినిమాలోని పాయింట్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ ప్లే విషయం లో టేకింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని సదరు పాయింటును సరికొత్తగా చెబితే తప్పకుండా ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. వాస్తవానికి ఇప్పుడు అగ్ర దర్శకులుగా ఎదిగిన చాలామంది ఇలాంటి సూత్రాన్నే పాటిస్తూ ఉంటారు. కొత్త కథలేవి పుట్టుకు రావు కాబట్టి ఉన్న కథలను స్క్రీన్ ప్లే పరంగా టేకింగ్ పరంగా కొత్తదనాన్ని చూపించి ఆ సినిమాలను ద్విజయాలు అందుకునేలా చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా విడుదలైన ఓ సినిమా గతంలో తెలుగులో వచ్చిన సినిమాకి యాజ్ టీజ్ గా ఉండడం నిజం గా దురదృష్టకరమనే చెప్పవచ్చు. అనుకుని చేశారో అనుకోకుండా చేశారో తెలియదు కానీ ఈ రోజే విడుదలైన ఆ సినిమాకు ఇటువంటి సమస్య రావడం ఎంతో క్లిష్టతరమైన పరిస్థితి అని చెప్పాలి. నాగ శౌర్య హీరో గా నటించిన కృష్ణ వృందా విహారి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం అందుకోవాలని గట్టి ప్రయత్నం చేసింది. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న ఈ హీరోసినిమా ద్వారా మంచి కం బ్యాక్ చేయాలని భావించాడు. 

అయితే ఈ సినిమా గతంలో వచ్చిన నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా తరహాలోనే ఉండడం ఒకసారిగా ప్రేక్షకులను నిరాస పరిచింది. చూసిన సినిమాను మళ్ళీ చూడాలా అని వారు మండిపడుతున్నారు. కాన్సెప్ట్ పరంగా ఏ మాత్రం తేడా లేదు. అలాంటి సినిమా కు టేకింగ్ విషయంలో కథనం విషయం లో అయినా జాగ్రత్త వహించాలి అని చెబుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ విధంగా పెట్టుబడిన రాపట్టుకుంటుందో చూడాలి. వరుసగా మరొక పరాజయాన్ని తన ఖాతాలో మూట కట్టుకొని నాగశౌర్య డిజాస్టర్ హీరోగా ఇప్పుడు మారిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: