టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తరచూ విదేశాలకు వెళ్తుంటారు. ఇక అది ఫ్యామిలీ వెకేషన్ కోసం కావొచ్చు లేదంటే పర్సనల్ పనుల కోసం కూడా కావొచ్చు.ఇదిలావుంటే ఇక ఇప్పుడు మరోసారి ఆయన ఫారెన్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇటీవల మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇక అతడి తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు.ఇక  దీంతో అతడు నటిస్తోన్న త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఆయన తిరిగి సినిమా సెట్స్ పైకి వస్తారని అందరూ అనుకున్నారు.ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్తున్నారట. అయితే అది కూడా సింగిల్ గా వెళ్తున్నారట.అంతేకాదు  మెడికల్ కన్సల్టింగ్ కోసం ఆయన ఫారెన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

 ఇక ఇష్యూ ఏంటి అనేది బయటకు రానప్పటికీ.. మెడికల్ రిలేటెడ్ పనుల కోసం ఆయన వెళ్తున్నట్లు సమాచారం.అయితే  అది పూర్తి చేసుకొని వచ్చిన తరువాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మళ్లీ మొదలవుతుంది. కాగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఇందులో మహేష్ బాబు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడట. అయితే మహేష్ బాబుకి ఇలాంటి సాఫ్ట్ రోల్స్ బాగా సూట్ అవుతాయి. ఇకపోతే ఇదివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ గా కనిపించారు.  ఈసారి ఉద్యోగిగా కనిపించనున్నారు.ఇక  నెక్స్ట్ షెడ్యూల్ లో పూర్తిగా కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తారు. కాగా ఈ షెడ్యూల్ లో పూజా హెగ్డే జాయిన్ కానుంది.ఇదిలావుంటే ఇక తొలిసారి మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. అయితే ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. ఇక సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్న మాట నిజమేనని..

కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని.. త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు నాగవంశీ. అంతేకాదు ఆయన ఇంకా ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేదని చెప్పారు. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' రెండూ థియేటర్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయని.. కానీ టీవీలో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయని చెప్పారు.అయితే ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నాగవంశీ.ఇక  సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. కాగా ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: