
నాగశౌర్య..అనూష శెట్టి అనే బెంగళూరుకి చెందిన ఒక యువతిని వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరి పెళ్లి నవంబర్ 20వ తేదీన జరగనున్నట్లు సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనూష శెట్టి టాలెంట్ గురించి.. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనూష శెట్టి గురించి తెలుసుకోవాలంటే ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రావీణ్యత సాధించారు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుంచి సర్టిఫికెట్ కూడా పొందారు అంతేకాదు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.అంతేకాదు బెంగళూరులో ఆమెకు సొంతంగా అనూష శెట్టి డిజైన్స్ అనే సంస్థ కూడా ఉంది. దానికి ఆమె మేనేజింగ్ డైరెక్టర్. 2019లో డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది. 2020లో దేశంలోనే టాప్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరిగా నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా అందుతున్న మరొక సమాచారం ఏమిటంటే.. అనూష శెట్టి కి నేరుగా జూనియర్ ఎన్టీఆర్ తో సంబంధం లేకపోయినప్పటికీ ఒక చిన్న కనెక్షన్ అయితే ఉందట. అనూష శెట్టి స్వస్థలం కర్ణాటకలోని కుందాపూర్.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని స్వస్థలం కూడా అదే కావడం విశేషం . ఈ రకంగా వీరిద్దరికి చిన్న కనెక్షన్ కుదిరింది.