తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన స్టార్ డమ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీnలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ విలన్ పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 18 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుbవారీగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు వీర సింహా రెడ్డి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు ఈ సినిమా 5.25 కోట్లు  3 వ రోజు 6.45 కోట్లు , 4 వ రోజు 7.25 , 5 వ రోజు 6.25 కోట్లు ,  6 వ రోజు 4.80 కోట్లు , 7 వ రోజు 3.16 కోట్లు , 8 వ రోజు 53 లక్షలు , 9 వ రోజు 94 లక్షలు , 10 వ రోజు 97 లక్షలు , 11 వ రోజు 1.44 కోట్లు ,  12 వ రోజు 16 లక్షలు , 13 వ రోజు 17 లక్షలు , 14 వ రోజు 8 లక్షలు , 15 వ రోజు 26 లక్షలు , 16 వ రోజు 11 లక్షలు , 17 వ రోజు 14 లక్షలు , 18 వ రోజు 41 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజులకు గాను 68.52 కోట్ల షేర్ , 111.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా వీర సింహా రెడ్డి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: