మన తెలుగు సినీ ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా అక్కినేని ఫ్యామిలీని చెప్పుకుంటారు. ఎందుకంటే ఏ.ఎన్.ఆర్ నుంచి ఇప్పటి నయా తరంలో నాగచైతన్య, అఖిల్ కూడా అదే దారిలో నడుస్తున్నారు. అయితే అక్కినేని అఖిల్ మాత్రం మాస్ హీరోగా పేరు తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన మొదటి సినిమా 'అఖిల్: అదే జోనర్ లో వచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూడు సినిమాలు రొమాంటిక్ జోనర్ లో వచ్చినవే. అయితే ఈ మూడిట్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. 

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలు చేయాలంటే సురేందర్ రెడ్డి కి అది వెన్నతో పెట్టిన విద్య. దాంతో ఇప్పుడు అఖిల్ ను ఏజెంట్ తో సూపర్ యాక్షన్ హీరోగా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ లో కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా హిట్ కొట్టాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు.

దీనికంటే ముందు ఈ దర్శకుడు తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి కూడా పాన్ ఇండియా చిత్రమే. కానీ అది జనాలకు అంత రీచ్ కాలేదు. ఇక మరోవైపు ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ మాస్ యాక్షన్ హీరోగా స్థిరపడిపోతాడని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అటు అఖిల్ కూడా అదే కోరుకుంటున్నాడు. ఏజెంట్ తో కేవలం తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా అఖిల్ కు మంచి మాస్ ఇమేజ్ వస్తుందని.. ఆ తర్వాత యాక్షన్ హీరోగా మారడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మరి అఖిల్ కి యాక్షన్ హీరో


మరింత సమాచారం తెలుసుకోండి: