సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  అగ్ర నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో చరణ్ కి జంటగా కియారా అద్వానీ హీరోయిన్గా అంటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ కు సంబంధించి స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారట. అయితే ఈ సాంగ్ ని మాత్రం కొన్ని దేశాల్లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సాంగ్ కోసం ఇండియన్ మైకల్ జాక్సన్ గా పేరుందిన స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను రంగంలోకి దింపారట శంకర్. ఈ మధ్యకాలంలో ప్రభుదేవా పెద్దగా కొరియోగ్రఫీ చేయడం లేదు. ఒకవైపు డైరెక్టర్‌గా మరోవైపు యాక్టర్ గా ఆయన ఎంతో బిజీగా ఉన్నాడు. అయితే దర్శకుడు శంకర్ మాత్రం ఈ సాంగ్ కోసం ప్రభుదేవాను స్వయంగా రిక్వెస్ట్ చేశారట. దీంతో ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు రామ్ చరణ్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటల్లోనే డాన్స్ చేశాడు. కానీ ఇప్పటివరకు ప్రభుదేవా కొరియోగ్రఫీలో చేయలేదు. ఇప్పుడు RC15లో మొదటిసారి ప్రభుదేవా కొరియోగ్రఫీలో చరణ్ డాన్స్ చేయబోతుండడంతో ఈ వార్త విని ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.

 ఖచ్చితంగా సినిమా మొత్తం లో ఈ సాంగ్ మెయిన్ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు శంకర్. ఒకవైపు రాంచరణ్ సినిమా మరోవైపు కమలహాసన్ భారతీయుడు 2 షూటింగ్‌ని సైతం పూర్తి చేస్తున్నాడు. అయితే రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ అంటే డైరెక్టర్‌కు అది కాస్త ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. అందుకే ముందు చరణ్ మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి ఆ తర్వాత భారతీయుడు షూటింగ్ ప్లాన్ చేయొచ్చని శంకర్ అనుకుంటున్నారట. అందుకే ఇప్పుడు తన ఫుల్ ఫోకస్ చరణ్ సినిమా మీద పెట్టినట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా ఫాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకంగా విడుదల కానుకగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: