మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం చిరంజీవి ఏకంగా రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఆచార్య మూవీ ప్రేక్షకులను నిరుత్సాహపరచగా గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇలా పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ప్రకాష్ రాజ్ ... బాబి సింహమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో వాల్టేరు వీరయ్య మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా చిరంజీవి తదుపరి సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తాజాగా చిరంజీవి కి ఒక కథను వినిపించినట్టు ... ఆ కథ బాగా నచ్చిన చిరంజీవి వెంటనే గోపి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గోపి ... చిరంజీవి కి ఎలాంటి కథ వినిపించలేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: