కాస్టింగ్ కౌచ్. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇది ఒక ట్రెండింగ్ టాపిక్. ఎప్పుడూ ఎక్కడో చోట ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తాజాగా రాశి ఖన్నా కూడా కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.రాశిఖన్నా హీరోయిన్ గా సినీ ఇండ్రస్ట్రీ లో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. 'మద్రాస్ కేఫ్' అనే సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా.. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లోను బిజీగా మారుతూ సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశిఖన్నా తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో పదేళ్ల జర్నీ అంటే అది మామూలు విషయం కాదు. నా అదృష్టం కొద్దీ ఈ జర్నీలో నాకు అందరూ మంచివాళ్లే పరిచయం అయ్యారు.నాకు జాన్ అబ్రహం ఒక మాట చెప్పారు. రాశి నువ్వు ఏ విషయంలోనైనా నో చెప్పాలనుకుంటే వెంటనే చెప్పేయ్. చెప్పడమే కాదు ఆ మాటకి కట్టుబడి ఉండు. అప్పుడే ఎవరైనా నిన్ను సీరియస్ గా తీసుకుంటారు. లేకుంటే లైట్ తీసుకుంటారు. అది మంచిది కాదు. నీ విలువ పెరగాలంటే నచ్చని వాటికి నో చెప్పేసేయ్ అని అన్నారు. ఇవాల్టికి నేను ఆ విషయాలని పాటిస్తున్నా. ఇప్పటివరకు నా దగ్గర ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు.

ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చాలా అనుమానాలు ఉంటాయి. చాలామంది చాలా విషయాలు చెబుతూ ఉంటారు. కానీ ఇండ్రస్ట్రీ లోకి వచ్చాక ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్ది మంచి, చెడులను మనమే అర్థం చేసుకోవాలి. ఇక భగవంతుడు దయవల్ల నాకు ఎటువంటి చెడ్డవాళ్ళు తగల్లేదు. అలాగని ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను. నాకైతే అలాంటి చేదు అనుభవాలు ఏమీ లేవు' అంటూ చెప్పుకొచ్చింది రాశిఖన్నా. ఇక ఇటీవల బాలీవుడ్లో 'ఫర్జీ' అనే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ సరసన నటించింది ఈ హీరోయిన్. ఫ్యామిలీ మెన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ ని అందుకుంది.ఇక రాశిఖన్నా ప్రస్తుతం నార్త్ లోనే పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: