తెలుగు యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా చాలా బిజీగా మారారు.

సినిమా సినిమాకు ఊహించని స్థాయి లో పాపులారిటీ దక్కించుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ను సంపాదించుకుంటున్నారు నిఖిల్. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఒక సినిమా తర్వాత మరొక సినిమాతో చాలా సెలెక్టివ్ గా ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ వైపుగా అడుగులు వేస్తున్న నిఖిల్ తన సినిమా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.

కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు స్వయంభు అనే టైటిల్ తో ఒక కొత్త సినిమాను కూడా ప్రకటించారు. ప్రస్తుతం వరుస విజయాలు వస్తున్న నేపథ్యంలో ఆయన పారితోషకం కూడా బాగా పెంచేశారు అని సమాచారం. మూడు నాలుగు కోట్లకే పరిమితమైన ఈయన ఇప్పుడు ఏకంగా స్వయంభూ సినిమా కోసం రూ.8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది...

ఇకపోతే హ్యాపీడేస్ వంటి సినిమాలలో చిన్నచిన్న క్యారెక్టర్ల ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన నిఖిల్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోగా ఎదుగుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు..ఇక స్వయంభూ సినిమాకి ఠాగూర్ మధు నిర్మాతగా అయితే వ్యవహరిస్తున్నారు.. టాప్ బ్యానర్లలో సినిమాలకు నిఖిల్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు.. నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత వచ్చే లాభాలలో వాటా కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. వార్ బ్యాక్ డ్రాప్ లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నిఖిల్ మరో పాన్ ఇండియా విజయం తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.మొత్తానికైతే నిఖిల్ కథల ఎంచుకనే విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: