టాలీవుడ్ స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రాజమౌళి క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది.ఇక ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో అన్నది ఎవరికి ఊహకి కూడా అందదు. ఇప్పటికే తన సినిమాలతో ప్రపంచ డైరెక్టర్లను సైతం ఆశ్చర్యపోయేలా చేశాడు రాజమౌళి. ఇక అలాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్వరలోనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తీయబోతున్నారు అని అంటున్నారు. ఈ సినిమాపై ఎన్ని రకాలుగా వార్తలు వస్తున్నప్పటికీ రాజమౌళి మాత్రం ఇంకా స్పందించడం లేదు. ఇదిలా ఉంటే ఇక తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ విలన్ గా నటించబోతున్నారు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాకి హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ రావాలి అంటే కచ్చితంగా అమీర్ ఖాన్ ఉంటే బాగుంటుంది అని అమీర్ ఖాన్ అయితే ఈ సినిమాలోని విలన్ పాత్రకి సరిగ్గా సూట్ అవుతాడని భావించి రాజమౌళి ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో హాలీవుడ్ లో క్రేజ్ ఉన్న దీపిక పదుకొనే హీరోయిన్గా నటించబోతోంది. ఇలా రాజమౌళి వరుసగా బాలీవుడ్ స్టార్స్ ని కేవలం హాలీవుడ్ మార్కెట్ కోసమే తీసుకుంటున్నాడు అని అంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో గ్లోబల్ వైడ్ గా ఫాలోయింగ్ ఉన్న బడా స్టార్లను తీసుకుంటే ఆ సినిమాకి కచ్చితంగా హాలీవుడ్ మార్కెట్ వస్తుందని భావించిన రాజమౌళి ఇలా చేస్తున్నాడట. అయితే ఇప్పటికే అమీర్ ఖాన్ తో ఈ విషయానికి సంబంధించిన చర్చలు కూడా జరిపేడట రాజమౌళి. అనంతరం ఈ సినిమాలో విలన్ రోల్ చేసేందుకు ఆయన కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇదే గనుక నిజమైతే కచ్చితంగా ఈ సినిమాకి హాలీవుడ్ మార్కెట్ రావడం ఖాయం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: