మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు రూమర్లుగా ఉన్న ఈ వార్త నిజం చేయబోతున్నట్లు తెలుస్తోంది తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం త్వరలోనే వీరు పెళ్లికి సిద్ధమవుతున్నారని ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా వీరిద్దరికి సంబంధించి ఒక ఎంగేజ్మెంట్ పోస్టర్ వైరల్ గా మారుతోంది .తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.


ఇప్పటికే కొన్ని రోజులుగా ఎంగేజ్మెంట్ కు సంబంధించి పలు పనులు జరుగుతున్నాయని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎంగేజ్మెంట్ కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతున్నట్లు సమాచారం. నిహారిక వివాహం తర్వాత మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఒకే చోటు చేరి వీరి వివాహం చేయబోతున్నట్లు మెగా సన్నిహితుల కుటుంబం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా పెళ్లి డేటు మాత్రం ప్రకటించలేదు. లావణ్య, వరుణ్ తేజ్ జంటగా మిస్టర్ మూవీలో నటించారు.. ఈ సినిమా భారీ అంచనాలు మధ్య విడుదలైన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.


దీంతో వీరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అంతరిక్షం అనే సినిమాలో కలిసి నటించారు.గత కొద్దిరోజులుగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది .ఒకటి రెండు సందర్భాలలో లావణ్య త్రిపాఠి విషయాన్ని ఖండించిన చివరికి ఈ విషయం నిజమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే లావణ్య త్రిపాఠి పులిమేక అనే టైటిల్తో ఒక వెబ్ సిరీస్లో నటించింది ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. చివరిగా ఈమె హ్యాపీ బర్తడే అనే సినిమాలో నటించిన ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ప్రస్తుతం వీరికి సంబంధించి ఒక పోస్టు వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: