తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ మొదట ఎన్నో సినిమాలకు మాటల రచయితగా ... కథ రచయితగా పని చేచి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ హీరోగా శ్రేయ హీరోయిన్ గా రూపొందినటువంటి నువ్వే నువ్వే మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టే మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత ఈ దర్శకుడు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ దర్శకుడు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో గుంటూరు కారం అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు  ఈ సినిమాలో శ్రీ లీల ... పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే పెద్దగా క్రేజీ లేని దర్శకులు కొత్త కొత్త దర్శకులు కూడా ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తున్నారు. కాకపోతే త్రివిక్రమ్ మాత్రం ఇప్పటివ రకు ఆ జోలికి పోలేదు. మహేష్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా త్రివిక్రమ్ ఆ ప్లాన్ చేయలేదు. త్రివిక్రమ్ తన తదుపరి మూవీ లను అల్లు అర్జున్ తోను ... ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. వీరిద్దరిలో ఏదో ఒక హీరోతో త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: