తెలుగు ఇండస్ట్రీలో మెగా అభిమానులు ఏం చేసినా అదో ప్రత్యేకమే అంటారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ఐ అండ్ బ్లెడ్ బ్యాంక్ కి వేల మంది వాలీంటర్లు ఉన్నారు.  తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చి ప్రేక్షకుల అభిమానం పొందుతున్నారు.  మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఇలా వరుసగా తన విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ వెళ్లారు రామ్ చరణ్.  

 

తన తండ్రి ఇచ్చింది వారసత్వమే అని.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే భవిష్యత్ తో రాణించగలం ని అంటారు రామ్ చరణ్. ఆయన నటనకు అద్దం పట్టేలా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’.  ఈ మూవీలో రామ్ చరణ్ చెవిటి పాత్రలో నటించి తన విశ్వరూపం చూపించాడు.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్.  ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. తాజాగా అఖిల భారత చిరంజీవి యువత వారు, చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రకళా పోటీలు నిర్వహించతలపెట్టారు.

 

ఈ పోటీల్లో చరణ్ గెటప్స్ ను మాత్రమే గీయవలసి ఉంటుంది.  ఇప్పటి వరకు రామ్ చరణ్ నటించిన చిత్రాలకు సంబంధించిన గెటప్ కి సంబంధించిన చిత్రాలను గీసి, ramcharanbirthday@yahoo.com అనే ఈ మెయిల్ ఐడీకి పంపించవలసి ఉంటుంది. ఉత్తమ పెయింటింగ్ ను ఎంపిక చేసి .. దానిని చిత్రీకరించినవారికి చిరు సత్కారం ఉంటుందని తెలియజేశారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: