తెలుగు బిగ్ బాస్ గేమ్ షోతో ఎంతోమంది ఎంట్రీ ఇచ్చి బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా బయట అవకాశాలు రాక ఫేడౌట్ అయిన వారు కూడా బిగ్ బాస్ లోకి వెళ్లి గుర్తింపు సంపాదించుకొని సినిమాలలో అవకాశాలు సంపాదించుకుంటున్నారు. కాని చాలా మంది సెలబ్రిటీల పరిస్థితులు అలా కనిపించడం లేదు.. గీతూ రాయల్ కూడా బిగ్ బాస్ వల్ల క్రేజ్ సంపాదించుకుంది.. చిత్తూరు యాసతో బాగా పాపులారిటీ సంపాదించిన ఈమె ఆ తర్వాత పలు షోలలో కూడా తెగ హడావిడి చేసింది. తనకు నచ్చినట్టుగానే ఉంటూ హౌస్లో చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు.


గీతూ రాయల్ టాప్5 లో ఉంటుంది అనుకుంటే అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ఆశ్చర్యపోయారు. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బిజీగా ఉన్నా ఇమే రెగ్యులర్గా ఏదో ఒక వీడియో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని సంఘటనల గురించి కూడా స్పందిస్తూ ఉంటుంది . తాజాగా గీతూ రాయల్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. ఆ వీడియోలో మాట్లాడుతూ..ఈమధ్య ఎక్కడ చూసినా కూడా జనాలు ఎక్కువగా చనిపోయారని న్యూస్ వినిపిస్తోంది.. చీమలు చచ్చినట్టుగా మరణిస్తున్నారు జనాలు... హనీమూన్ కి వెళ్తే టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నారు లేదా భార్య చంపేస్తోంది.. మరి కొంతమంది తమ పిల్లల్ని కుక్కర్లో ఉడికించి చంపుతున్నారు.. ఇలా బస్సు, రైళ్లు ,విమానాలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.


మొన్న ఏకంగా విమాన ప్రమాదంలో 250 మంది మరణించారు. నాకు కూడా 20 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగిందని తెలిపింది. కేవలం సెకండ్లలోనే చావు నుంచి బయటపడిపోయానని అది అదృష్టం అనే చెప్పాలి అంటూ తెలిపింది గీతూ రాయల్. అందుకే మనసుకు నచ్చిందే చేయాలి అందరిని ప్రేమించాలి అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: