ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని కీలకరాజకీయ నేతలను గృహనిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 5 నుంచి వాళ్ళు గృహనిర్బంధంలో ఉన్నారు.  దీంతో బయట ఎదో జరిగిపోతోందని, ప్రజలను హింసిస్తున్నారని ఆరోపణలు చేశారు.  అయితే, గృహనిర్బంధంలో ఉన్న నాయకులను ఈరోజు రిలీజ్ చేశారు.  


జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ 24 వ తేదీన స్థానిక సంస్థలైన బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్ లు ఓటింగ్ లో పాల్గొంటారు. నిర్బందంలో ఉంటె ఎన్నికలు పారదర్శకంగా జరగవని చెప్పి జమాతే ఏ ఇస్లామీ హింద్ అనే పార్టీ ప్రభుత్వాన్ని కోరింది.  ఆ పార్టీ అభ్యర్థను మన్నించిన ప్రభుత్వం నేతలను విడుదల చేశారు.  


ఆంక్షలను సడలించారు.  అయితే, ఎక్కడైనా ఎలాంటి సంఘటనలు జరిగినట్టు కనిపిస్తే తిరిగి గృహనిర్బంధం విధించే అవకాశం లేకపోలేదు.  ఫరూక్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్నట్టుగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నది.  తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దేవేంద్రసింగ్ రానా, హర్షదేవి సింగ్, రామన్ భల్లాలను ప్రభుత్వం విడుదల చేసింది.  


జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 310 బీడీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  అయితే, మిగతా వారిని కూడా రిలీజ్ చేయాలనీ, అప్పుడే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని నేతలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. మరి ముఖ్యనేతలైన ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి, ఫరూక్ అబ్దుల్లా తదితరులను ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో లేదంటే వారిని రిలీజ్ చేయకుండా అలానే గృహనిర్బంధంలో ఉంచుతుందో చూడాలి.  యితే, వారిని వదిలితే ... తప్పకుండా తిరిగి రాష్ట్రంలో అలజడులు జరిగే అవకాశం ఉంటుంది.  అసలే ఇప్పుడు పాక్ అదును కోసం కాసుకొని చూస్తున్నది. ఏదైనా చిన్న సందు దొరికినా ఇండియాపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నది.  ఈ సమయంలో ప్రభుత్వం ఈ విషయంలో  ఒకటికి నాలురు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: