తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర రాజకీయంపై ఇప్పుడు అన్ని వర్గాలు ఆసక్తి కరం గా చూస్తున్నాయి. ఈటెల రాజేంద్ర హుజూరాబాద్లో సాధించిన విజయం తర్వాత తెలంగాణ బీజేపీ లో ఆయన పవర్ హౌస్ గా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బిజెపి లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని కొంత మంది కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈటెల రాజేందర్ అన్న ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి బండి సంజయ్ సుముఖంగా లేరని ఇన్ని రోజులు తాను పార్టీ కోసం కష్టపడుతూ భవిష్యత్తులో కూడా కష్ట పడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే హుజురాబాద్ విజయంతో ఈటెల రాజేందర్ అన్న ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తన పరిస్థితి ఏంటి అని ఆవేదన లో ఉన్నారట. అయితే ఈటెల రాజేంద్ర కి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకత్వం ఎక్కువగా ఫోకస్ చేసి ఆయనతో సన్నిహితంగా ఉండే నాయకులను తమ వైపు తిప్పుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నాలు చేస్తోంది.

ఈటెల రాజేంద్ర కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సీరియస్గా దృష్టి పెట్టి ఆయనకు సంబంధించిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేయించే అవకాశం ఉందని భూకబ్జాలకు సంబంధించిన అధికారులు త్వరలోనే విచారణ మొదలు పెట్టే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా వస్తున్నాయి.రాబోయే వారం పది రోజుల్లో దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలయ్యే అవకాశం ఉందని భూ సర్వే లు చేసే అవకాశం ఉందని ప్రధానంగా ఈటెల రాజేందర్ సతీమణి జమున రాజేందర్ కు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఎటువంటి పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకుంటాయి అనేదే ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఆసక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: