
ఇలా ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం వాతావరణం బాగా వేడెక్కిపోతుంది. అందుకు మధ్యలో తైవాన్ వ్యవహారం మరింత కారణం అవుతుంది. అమెరికా తైవాన్ కు ఐక్యరాజ్యసమితిలో స్థానాన్ని కలిపించాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. తద్వారా దానికి శాశ్వత రక్షణ ఏర్పాటు చేయబడుతుంది. చైనా కూడా అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకుగాను అమెరికా ఆంక్షలు పెట్టిన ఇరాక్ తో కొత్త ఒప్పందాలకు పూనుకుంటుంది. అంటే ఒకరికొకరు కాలే పనులు బాగా చేసుకుంటున్నారు. చైనా ముందు తైవాన్ ను సొంత చేసుకొని, ఆ ఉత్సాహంతో భారత్ పైకి వెళ్లాలని చూస్తుంది. లేదా తైవాన్ ను అడ్డుపెట్టుకొని భారత్ ను చుట్టుముట్టాలని చూస్తుంది. అయితే అనుకున్నవి ఏవి జరగకపోవడంతో చైనా నిరాశగానే ఉంది.
జిన్ పింగ్ యుద్దాలు చేసి, గొప్పగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆలోచిస్తుండగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు చైనాలో కూడా మరోసారి కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇలా చైనా ను అడుగువేయనీయకుండా అన్ని సమస్యలు చుట్టుముట్టాయి. చూడాలి చైనా తన దారిని ఏవిధంగా మార్చుకుంటుంది అనేది. అమెరికా కూడా కరోనా చైనా పుణ్యమే అని పూర్తిగా నమ్ముతుంది, దానిని రుజువు చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఏదోటి చేసి ఆ దేశాన్ని ప్రపంచం ముందు దోషిగా తేల్చాలని అమెరికా తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ఈ స్థితిలో చైనా మొదట యుద్ధభేరి మోగిస్తే, దానిపై ప్రపంచం అంతా విరుచుకు పడే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది.