టీటీడీ పాల‌క మండ‌లి స‌మావేశం ఇవాళ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వైవీ సుబ్బారెడ్డి ఈ నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించారు. వైకుంఠ ఏకాద‌శ‌మి సంద‌ర్భంగా 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ‌ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పిస్తాం అని వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా వైకుంఠ‌ద్వారా ద‌ర్శ‌నం ప్రారంభం అవుతుంద‌ని.. కొవిడ్‌-19 నిబంధ‌న‌లు స‌డ‌లిస్తే పండుగ త‌రువాత స‌ర్వ‌ద‌ర్శ‌నం పెంపు, అర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం ప్రారంభిస్తాం అని వెల్ల‌డించారు. 11 మంది చిన్న పిల్ల‌ల‌కు విజ‌య‌వంతంగా గుండె శ‌స్త్రచికిత్స నిర్వ‌హించార‌ని.. చిన్న పిల్ల‌లు ఆసుప‌త్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భ‌క్తుల‌కు ఉద‌యాస్త‌మాన సేవ‌కు అనుమ‌తించే విధంగా అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసారు సుబ్బారెడ్డి.

ఉదయాస్తమాన సేవా టికెట్లు 11 ప్రస్తుతం ఖాళీగా ఉన్నా.. టిని భక్తులుకు కేటాయిస్తామని, బోర్డ్ సభ్యులు కూడా కొంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారని తెలిపారు. హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని.. నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపంను నిర్మిస్తాం అని వెల్లడించారు. భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాన్ని రోడ్డు మార్గంగా అభివృద్ధి పర‌చ‌డానికి నిర్ణయం తీసుకున్నారని.. హిందూ ధ‌ర్మ ప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేవిధంగా  ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు.

ఇటీవ‌ల కురిసిన వ‌ర్షం కార‌ణంగా అన్న‌మ‌య్య ప్రాజెక్ట్ వ‌ద్ద కొట్టుకుపోయిన ఆల‌యాల‌ను తిరిగి పునఃప్రారంభిస్తాం అని.. ఐటీ విభాగాన్ని ప‌టిష్ట‌వంత‌ముగా నిర్వ‌హించేందుకు ఉద్యోగ నియ‌మకాలు చేస్తాం అని స్ప‌ష్టం చేసారు. 2.6కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నూత‌న ప‌ర‌కామ‌ని మండ‌పంలో యంత్రాలు కొనుగోలు చేస్తామ‌ని, శ్రీ‌శైలం ఆల‌య గోపురానికి బంగారు తాప‌డం ప‌నులు కూడా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. తాళ్ల‌ప‌త్ర కందిరీగ‌ల‌ను ప‌రిర‌క్షించ‌డానికి  ఎస్‌వీ వేద విద్యాల‌యంలో మ్యాన్ స్క్రిప్ట్ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.

అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యం కల్పిస్తాం అని,  భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తామ‌ని వెల్ల‌డించారు.  కళ్యాణకట్ట క్షురకులుకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచామ‌ని,  3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తాఅని..  10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. రూ. 12 కోట్ల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మాణం చేప‌డుతున్న‌ట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: