దేశంలో కరోనా ప్రభావంతో ఇప్పటికే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి కోలుకుంటున్న సమయంలో ఈ మహమ్మారి కరోనా  వైరస్  మళ్లీ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ సాధారణంగా ఈ కరోణ కేసుల తో పాటుగా ఒమిక్రాన్ కేసులు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో డిప్యూటీ సీఎం ఒక ప్రకటన చేశారంటే రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉందో ఇది చూస్తే అర్థం అవుతోంది. మహారాష్ట్రలో కరోణ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే శనివారం రోజు వరకు 50 శాతం ఎక్కువగా పెరిగాయని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 20 మంది ఎమ్మెల్యేలకు మరియు పదిమంది మంత్రులకు కరోణ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. రాష్ట్రంలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు తప్పనిసరిగా విధించేలా చర్యలు చేపట్టాలని పవార్ అన్నారు. అయితే ఎనిమిది వేలకు పైగా కేసులు పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేశారు పవర్.

మహారాష్ట్రలో ఇప్పటికే ఈ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉండడంతో రాత్రి కూడా కర్ఫ్యూను తీసుకొచ్చింది. ఇంకా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పగటిపూట కూడా ఆంక్షలు అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఒకేసారి 20 మంది ఎమ్మెల్యేలకు, పదిమంది మంత్రులకు కరోనా వైరస్ ప్రభావంతో  అధికారిక కార్యక్రమాలు మరియు పాలన పై ప్రభావం చూపిస్తోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని, వ్యాక్సిన్ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే  ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపైన కూడా నిఘా పెడుతోంది. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే మాత్రం లాక్ డౌన్ విధించాలని ప్రచారం కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కరోణ కేసులలో ఎక్కువగా మహారాష్ట్రలోని ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇది జనాభా పరంగా పెద్ద రాష్ట్రం, అలాగే ఎక్కువగా వ్యాపార వాణిజ్యాలు జరుగుతాయి. దీంతో అక్కడ వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ వేడుకలకు కూడా అధికారులు ఆంక్షలు  విధించారు. అయినా వైరస్ వ్యాప్తి ఆగడం లేదని  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: