బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగిపోయుంటుంది. నరేంద్రమోడీ అంటే ఏమిటో మమతకు ఇపుడు బాగా తెలిసొచ్చుంటుంది. ఇపుడు దీదీ పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకలాగ తయారైపోయింది. వెనక్కుతిరిగి నాన్ ఎన్డీయే పార్టీల దగ్గరకు వెళ్ళలేందు అలాగని ఎన్డీయేతో ముందుకు సాగలేందు. మొత్తానికి బెంగాల్ దీదీని మోడీ పైకిలేవటానికి వీల్లేకుండా గట్టిదెబ్బ కొట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన మంత్రి పార్ధాచటర్జీని ఎన్పోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టుచేసింది.





ఛటర్జీతో పాటు మంత్రికి సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీని కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. అలాగే విద్యాశాఖ మంత్రి ప్రకాష్ అధికారి, ఎంఎల్ఏ, ప్రాధమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్యతో పాటు మరికొందరు నివాసాలపై ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది. అర్పిత ఇంట్లో జరిగిన సోదాల్లో రు. 20 లక్షల విలువైన బంగారు, వజ్రాలున్నాయి. అలాగే రు. 20 కోట్లు హార్డ్ క్యాష్ కూడా దొరికింది. పార్ధాచటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. అందుకు అప్పట్లోనే చటర్జీపై కేసు నమోదైంది.





అప్పట్లో నమోదైన కేసు ప్రకారమే ఇపుడు సోదాలు జరగటం, కోట్లరూపాయల డబ్బు పట్టుకోవటం, అరెస్టులు చేయటం అంతా చాలా స్పీడుగా జరిగిపోయింది. తన కళ్ళముందు జరుగుతున్న సోదాలు, అరెస్టులతో మమతకు బుర్రగిర్రున తిరిగిపోయుంటుంది. ఎందుకంటే  ఉపరాష్ట్రపతిగా పోటీచేస్తున్న తన బద్ధశతృవు జగదీప్ థనకర్ గెలుపు పోరక్షంగా మమత సహకరిస్తున్నారు. తనకెంతో విలువిస్తున్న నాన్ ఎన్డీయే పార్టీలను కూడా కాదని నరేంద్రమోడీతో రహస్య ఒప్పందం జరిగిందనే ప్రచారం తెలిసిందే.





ఇందులో భాగంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు మమత ప్రకటించారు. ఒకవైపు రహస్య ఒప్పందం జరిగిన తర్వాత, ఎన్నికను బహిష్కరించి థనకర్ గెలుపుకు సహకరించిన తర్వాత ఏమాత్రం ఊహించని రీతిలో తనకు సన్నిహితుల ఇళ్ళపై ఈడీ దాడులు చేసి అరెస్టులు చేయటాన్ని మమత తట్టుకోలేకపోతున్నారు. ఇపుడేమి చేయాలో తెలీక బహుశా తల బాదుకుంటుండచ్చు. మొత్తానికి దీదీని మోడీ ఎటూ కాకుండా చేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: