రాజకీయాలలో రాణించడం అంటే అంత సులభం కాదు. అందుకు చాలా విషయాలు కలిసి రావాలి. మనలో ఎంత దమ్మున్నా సదరు రాజకీయ పార్టీ లేదా పార్టీలోని నాయకుల మద్దతు లేకపోతే పెద్దగా నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు. ఏళ్ల పాటు రాజకీయాలలో ఉన్నా గుర్తింపు రాదు.  ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది ప్రముఖ నటి మరియు రాజకీయ నాయకురాలు విజయశాంతి. ఈమెను అందరూ లేడీ అమితాబ్ గా పిలుచుకుంటారు. తన నటనతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. దాదాపు 25 సంవత్సరాల క్రిందటే విజయశాంతి బీజేపీ లో చేరారు.

అయినా ఎందుకో అంతటి గుర్తింపు ఉన్న జాతీయ పార్టీలో ఉన్నా డెవలప్ కాలేకపోయారు. నాయకులు సైతం ఈమెను అంతగా పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో తల్లి తెలంగాణ పార్టీని కూడా స్థాపించారు. అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. మళ్లీ కేసీఆర్ పార్టీ తెరాసా లో చేరి, కేసీఆర్ చెల్లిగా పేరు తెచ్చుకున్నా రాజకీయంగా పదవులను పొందలేకపోయింది. ఆ పార్టీలోనూ ఎక్కువ కాలం ఉండలేక బయటకు వచ్చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది... అందులోనూ తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. ఇక అన్ని పార్టీలు అయిపోయాక మళ్లీ చివరిగా మొదట చేరిన పార్టీ బిజెపిలోకి వచ్చి చేరారు. పార్టీలో ఉండి దాదాపు సంవత్సరం పైగానే కావస్తోంది. అయినప్పటికీ పార్టీలో తనకు సరైన ప్రాముఖ్యత దక్కింది లేదు. కానీ పేరుకి మాత్రం జాతీయ స్థాయి పాత్ర... జాతీయ కార్యవర్గ సభ్యురాలు.

అయితే ప్రజలు మరియు ప్రముఖ రాజకీయ ప్రముఖులు సైతం విజయశాంతిని  సరిగా వాడుకోవడంలో పార్టీలు ఎందుకో విఫలం అవుతున్నాయి అని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు చెబుతున్న ప్రకారం పార్టీలోకి ఎంత ఫేమ్ ఉన్న వారు వచ్చినా... వెంటనే పదవులు కట్టబెట్టే సిద్దాంతాలు ఉన్న పార్టీ కాదు. బీజేపీ ని నమ్ముకుని ఏళ్ల తరబడి సేవ చేస్తున్న వారికే ఇక్కడ గుర్తింపు పదవులు లభిస్తాయని తెలుస్తోంది. అందుకే ఈమె అంత సంతోషంగా ఏమీ లేదు. దీనిని బట్టి చూస్తే విజయశాంతి త్వరలో రాజకీయ సన్యాసం తీసుకోవడమా లేదా ఇంకేదైనా సంచలన నిర్ణయం తీసుకోవడమా చేస్తుందని అంతా అనుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: