తెలంగాణా చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీనుండి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కాబోతోంది. అలాగే 26వ తేదీనుండి భరోసా యాత్ర మొదలుకాబోతోంది. డిసెంబర్ 14వ తేదీవరకు జరిగే భరోసాయాత్ర ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ సిగ్మెంట్లను కవర్ చేయబోతోంది. మెదక్, దుబ్బాక, జహీరాబాద్, ఆందోల్, గద్వాల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ళ, పరిగి, నల్గొండ, తుంగతుర్తి, సూర్యాపేట, పరకాల, వర్ధన్నపేట, ములుగు, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోటారు సైకిళ్ళ ర్యాలీలు పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ డిసైడ్ చేసింది.





భరోసాయాత్ర ప్లానింగ్ వరకు ఓకేనే కానీ ఉద్దేశ్యమే నెరవేరటంలేదు. భరోసా యాత్రవల్ల పార్టీ రెండు లక్ష్యాలను పెట్టుకున్నది. మొదటిదేమో జనాలకు భరోసా ఇవ్వటం, రెండోదేమో బీజేపీలో చేరాలనే నేతలకు భరోసా కల్పించటం. అయితే రెండు టార్గెట్లలోను పార్టీ ఫెయిలవుతోంది. ఎలాగంటే వచ్చేఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వచ్చేస్తుందనే భరోసాను కల్పించలేకపోతోంది కాబట్టే ఇతర పార్టీల నుండి నేతలు వచ్చి చేరటంలేదు.





కాంగ్రెస్ ముఖ్యంగా టీఆర్ఎస్ నుండి భారీగా వలసలు జరుగుతాయని బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్నది. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో చేరినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. మునుగోడు ఉపఎన్నికకు కారణమైన రాజగోపాలరెడ్డి ఓడిపోవటంతో చేరికలకు బ్రేకులు పడ్డాయి. తొందరలో మర్రి శశిధరరెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. అయితే ఈయన వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగమేమీ ఉండదు.






కాంగ్రెస్ నుండే నేతలు పెద్దగా వచ్చి బీజేపీలో చేరకపోతే ఇక టీఆర్ఎస్ నుండి ఎందుకు వస్తారు ? బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే భరోసా ఉంటే ఎలాంటి యాత్రలు చేయకపోయినా నేతలు వచ్చి చేరుతారు. భరోసా రాకపోతే ఎన్ని భరోసా యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. అధికారంలోకి వచ్చేస్తామనే భరోసా ఇతరపార్టీల్లోని నేతల్లోనే  లేకపోతే ఇక మామూలు జనాలకు ఎలావస్తుంది ? అందుకనే బీజేపీ భరోసాయాత్ర ఇప్పటికైతే  రెండువిధాలుగాను ఫెయిలైనట్లే. 





మరింత సమాచారం తెలుసుకోండి: