
అయితే మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెడితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉంటుందన్న విషయంపై రాజకీయ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ జాతీయ పార్టీలో చేరిన ఆ ఇద్దరు నాయకులు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏమంత ప్రభావం చూపిస్తారన్న ఆశలేదు అని ఆంద్రా పొలిటికల్ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. ఇక ప్రధానమైన విషయాన్ని ఆంద్రా ప్రజలు ఆలోచిస్తే ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి ఉండదు అనే చెప్పాలి. గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రము... అద్భుతమైన సిటీ హైదరాబాద్ రాజధానిగా ఉండి.. అన్ని హక్కులు, అధికారాలను మనమంతా అనుభవిస్తూ ఉండేవాళ్ళము.
కానీ దివంగత సీఎం వైఎస్ మరణం తర్వాత రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసి పుణ్యం కట్టుకుంది. అప్పటి నుండి మన రాష్ట్ర ప్రజలకు కష్టాలు మొదళ్లయ్యాయి. ఇప్పటికీ రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కనీసం ప్రాపర్ గా రాజధానిని కూడా నిర్మించకపోవడం మన దురదృష్టం అని చెప్పాలి. ఇక అభివృద్ధి సంగతి సరేసరి... అలా మన రాష్ట్రము అస్తవ్యస్తంగా మారడానికి కారణమైన తెలంగాణ నేత కేసీఆర్ పార్టీకి ఓటు వేస్తారని నమ్మకం లేదు అని చెప్పాలి. ఇక మరికొందరు రాజకీయ విశ్లేషకులు అయితే కేసీఆర్ బి ఆర్ ఎస్ కు అంత సీన్ లేదు అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.