ఇంతకాలానికి జనసేన అధినేత పొత్తుల విషయమై స్పందించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తుంటుందని చెప్పకనే చెప్పారు. ఒంటరిగా పోటీచేస్తే జనసేన అధికారంలోకి వస్తుందన్న భరోసాను ఇస్తే ఒంటరిగా పోటీచేయటానికైనా తాను సిద్ధంగానే ఉన్నట్లు జనసైనికులను ఉద్దేశించి అన్నారు. అయితే ఒంటరిగా పోటీచేస్తే అధికారంలోకి వస్తానన్న నమ్మకం లేదని కూడా పవనే చెప్పారు. గతంలో తనకు ఎదురైన అనుభవం వల్లే రాబోయే ఎన్నికల్లో ఒంటరిపోరాటానికి తాను వెనకాడుతున్నట్లు చెప్పారు.





గౌరవ మర్యాదలకు లోటులేకుండా కుదిరితే పొత్తు లేకపోతే ఒంటరిపోరాటమే అని పవన్ స్పష్టంగా ప్రకటించారు. అంటే పవన్ ప్రకటన ప్రకారం తెలుగుదేశంపార్టీతో పొత్తుకు సిద్ధపడినట్లే అనిపిస్తోంది. ఈ మధ్యనే చంద్రబాబునాయుడుతో పవన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలోనే పొత్తులు ఖాయమైనట్లున్నది. కాకపోతే నియోజకవర్గాలు, సీట్ల సంఖ్య తేలినట్లు లేదు. అందుకనే గౌరవమర్యాదలకు లోటు లేకుండా అని చెప్పారు.





ఇక్కడ గౌరవమర్యాద అని అన్నారంటే జనసేన అడిగినన్ని సీట్లని అర్ధం. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత నుండి జనసేనకు టీడీపీ 24 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరించినట్లు ప్రచారంలో ఉంది. అయితే జనసేన మాత్రం 45 సీట్లు అడుగుతున్నట్లు ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. అయితే జరుగుతున్న ప్రచారంగురించి పవన్ ఏమీ మాట్లాడలేదు.  జనసేన ఒంటరిగా పోటీచేస్తే గెలవదని పవన్ కే అర్ధమైపోయింది. అందుకనే బలవంతుడైన దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే పొత్తులు అవసరమన్నారు.





ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని చెప్పింది ఇందుకే అని క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏదేమైనా ప్రతిపక్షాలు దేనికదే పోటీచేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమని పవన్ కు అర్ధమైంది. ఇక్కడే జగన్ అంటే పవన్ ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. మళ్ళీ ఇదే సమయంలో జనసేన సభలకు వచ్చి సీఎంసీఎం అని అరిచేవారంతా తనకే ఓట్లేస్తారన్న నమ్మకం కూడా తనకు లేదని పవన్ మరోసారి చెప్పారు. అంటే సభలకు వచ్చేవారిని చూసి తాను ఒంటరిగాపోటీచేస్తే జనసేనకు వీరమరణమే అని పవన్ స్పష్టంగా ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: