తాజాగా ఎల్లోమీడియాలో అచ్చయిన చె(కొ)త్తపలుకులో బాటమ్ లైన్ ఏమిటంటే కేసీయార్ కూడా చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే నడుస్తున్నారని. ఎప్పుడైతే జాతీయ రాజకీయాల్లోకి యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కేసీయార్ నిర్ణయించుకున్నారో అప్పటినుండే డబ్బులతోనే రాజకీయాలు చేయాలని ఫిక్సయిపోయారట. అందుకనే తెలంగాణాలోని ప్రైవేటు సంస్ధలు, కార్పొరేట్లపైన బాగా ఆధారపడ్డారట. ఎందుకంటే సింపుల్ వందల కోట్ల రూపాయల వసూళ్ళ కోసమేనట.





తెలంగాణాలో అంటే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల వందల కోట్ల రూపాయలు విలువైన భూములు న్యాయవివాదాల్లో ఇరుక్కుని ఉన్నాయట. వివాదాల్లో లీగల్ సమస్యలను క్లియర్ చేసుకోవాలని, ప్రభుత్వమే కేసుల్లో గెలవాలని కోరుకోవాల్సిన కేసీయార్ మాత్రం ప్రైవేటు వ్యక్తులు గెలిచేట్లుగా చక్రంతిప్పుతున్నట్లు ఎల్లోమీడియా చెప్పింది. రు. 8 వేల కోట్ల విలువైన భూమి విషయంలో కేసీయార్ స్టాండ్ చాలా విచిత్రంగా ఉందట. కోర్టులో ప్రభుత్వ వాదన వీగిపోయేలా చూడాలని కేసీయార్ ఇచ్చిన ఆదేశాలతో సంబంధీకులు నివ్వెరపోయారట. 1995లో చంద్రబాబునాయుడు కూడా కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తు విలువైన ప్రభుత్వ ఆస్తులను రాసిచ్చేశారు.





ఈ మధ్యకాలంలో కేసీయార్ ప్రైవేటు వ్యక్తుల తరపున వకాల్తాపుచ్చుకోవటం వల్ల కార్పొరేట్లు లేదా ప్రైవేటు వ్యక్తులు లాభపడుతున్నారట. హైకోర్టు, సుప్రింకోర్టులో వివాదాల్లో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూముల విషయంలో కేసీయార్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారట. కేసీయార్ ఆలోచనలను తూచా తప్పకుండా అమలుచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో అరవింద్ కుమార్, జయేష్ రంజన్ ముందు వరసలో ఉన్నట్లు సదరు ఎల్లోమీడియా తీవ్రంగా ఆరోపించింది.





తెలంగాణాలో ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నప్పటికీ కీలకమైన శాఖలన్నీ కేవలం ఐదారుగురు ఉన్నతాధికారుల చేతిలోనే ఉన్నాయంటేనే పాలకులు, ఉన్నతాధికారులు ఏ స్ధాయిలో కుమ్మక్కయ్యారో అర్ధమైపోతున్నదట. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కేసీయార్ వ్యవహరిస్తుండటంతో అధికారుల దోపిడీ ఓ రేంజిలో జరుగుతున్నట్లు ఎల్లోమీడియా మండిపడింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే జాతీయ రాజకీయాల్లో నిధులు సమకూర్చటానికి, ప్రతిపక్షాల్లో కొన్నింటికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి వేల కోట్లరూపాయల భూములను వదిలేస్తున్నారట. మరి ఎల్లోమీడియా తాజా ఆరోపణలు, వివరాలపై కేసీయార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా ఒక్క వార్తకూడా సహించలేని కేసీయార్ ఈ పలుకు విషయంలో ఏమిచేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: