
ఇక ఈ క్రమం లోనే జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడిని ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ గుదేసింది .. ఇక ఈ ఘటన లో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు .. వెంటనే స్పందించిన స్థానికులు 108కి సమాచారం అందించి .. వెంటనే అతని ఆస్పత్రి కి తరలించారు .. అయితే ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటూ వృద్ధుడు చనిపోయాడు .. అయితే తన కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని పట్టించుకోకుండా జగన్ తో పాటు వైసిపి నాయకులు గుద్దేసి అలా వెళ్ళిపోయారు .. దీంతో ఇప్పటికే జగన్ తీరు వ్యవహార శైలపై విమర్శలు వస్తున్నాయి ..
పోలీసుల వేధింపుల కారణంగా.. వైసీపీ నేత, రెంటపాళ్ల ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు . అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందు వైసిపి భారీ కుట్రకు తెర తీసినట్లు జాతీయ నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం వచ్చింది .. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గొడవలు సృష్టించేందుకు వైసిపి శ్రేణులు కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తుంది . ఇక దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది అందులో భాగంగా భారీగా పోలీసులను రంగంలోకి దింపింది .. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటుంది ..