ఈ ఏడాది ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే మెగా టోర్నీల నేపథ్యంలో ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా చూసేందుకు అటు ప్రపంచం క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అన్ని ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు మాత్రం ఇక ఈ మెగా టోర్నీల కోసం మళ్లీ ఏదైనా ఓటీపీ ప్లాట్ ఫామ్ సబ్ స్క్రైబ్ చేసుకోవలసి వస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ను  జియో సినిమాలో ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించినట్లుగానే.. ఇక ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్ విషయంలో కూడా ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎంత బాగుండు అని క్రికెట్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


సాధరణంగా మనసులో ఏదైనా గట్టిగా కోరుకుంటే అది నిజం అవుతుంది అని అంటూ ఉంటారు. అయితే ఇక ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ని ఫ్రీగా చూడాలని క్రికెట్ లవర్స్ అందరు కాస్త గట్టిగానే కోరుకున్నారేమో.. ఎందుకంటే ఇప్పుడు అది నిజం కాబోతుంది అని చెప్పాలి. ఏంటి మీరు అనేది.. వరల్డ్ కప్, ఆసియా కప్ లను ఫ్రీగా చూడొచ్చా.. ఎక్కడ ఎవరు ఈ ఆఫర్ ప్రకటించారు అని తెలుసుకోవడానికి కాస్త ఆతృతగా ఉన్నారు కదా.. ఎప్పుడు క్రికెట్ స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరించే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ నిర్ణయం తీసుకుంది.


 ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా ఒక పండగ లాంటి వార్త చెప్పింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ని ఫ్రీగా వీక్షించవచ్చు. ఈ రెండు టోర్నీలను ఉచితంగా స్ట్రీమ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇక్కడే ఒక కండిషన్ పెట్టింది. కేవలం మొబైల్ లో మాత్రమే ఇలా ఉచితంగా చూసేందుకు అవకాశం ఉంది అంటూ తెలిపింది. కాగా సెప్టెంబర్ లో ఆసియా కప్, అక్టోబర్ నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: