విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంగీకరించిందని పరిశ్రమలు, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒక కేంద్ర బృందం ఏర్పాటు చేయనున్నట్లు సీఎండీ సింఘాల్ చెప్పారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఈ బృందాన్ని నడిపించేలా నోడల్ అధికారి నియమించనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో  భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింఘాల్ తో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటికి గల  ఆలోచనలను బీహెచ్ఎల్ సీఎండీ ప్రశంసించారు.


 పాఠశాల విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. మంత్రి మేకపాటి ఇతర ప్రతిపాదనల పట్ల  కూడా బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్ సానుకూలంగా స్పందించారు. మేరకు  ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు, నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యమవుతామని మంత్రి మేకపాటికి తెలిపారు.


బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఎంట్రిప్యూనర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం, రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న 13 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక సోలార్ పానల్స్ ఏర్పాటు మంత్రి మేకపాటి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: