కరోనా వ్యాప్తి ఫలితంగా ఇరుగు పొరుగు దేశాలు వైద్యారోగ్య సమస్యలు దేశాల వ్యాప్తంగా తలెత్తినప్పుడు, ఆ దేశాలు ఈ మహమ్మారి నుంచి ఉత్పన్నమైన ప్రమాదం అర్ధంకాక సతమతమౌతుంటే, ఆ దేశాలను మరింత ఇరుకున పెట్టి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే తలంపుతో సరిహద్ధు దేశాలతో కయ్యాలకు కాలు దువ్వటం గతంలోనే మొదలెట్టింది డ్రాగన్‌ చైనా.



ఇప్పుడు మాయావి చైనా తన వంకర బుద్ది మరోసారి బయటపెట్టింది. కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌‌ విషయంలో డ్రాగన్‌ చైనా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ప్రత్యేకించి మరో తీవ్రమైన ఝలక్ ఇచ్చింది.



భారత్ పై డ్రాగన్‌ చైనా ఇచ్చిన ఝలక్ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, చైనా కావాలనే భారత్‌ కు సమస్యలు సృష్టిస్తోందని అనిపిస్తోంది. పరోక్షంగా భారత్ పై సమరం ప్రకటించినట్లే.



దేశంలో కోవిడ్-19 సెకండ్-వేవ్ ఉదృతంగా ఉంది. కోవిడ్-19 కేసులు రఒజురోజుకి  కొండవీటి చాంతాడులాగా పెరిగి పోతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చైనా నుంచి భారత్ కు ఎగుమతులు చేసే సరపరాదార్లు  కోవిడ్-19 సంబంధిత గూడ్స్ ధరలను 5 రెట్లు వరకు భారీగా పెంచేశాయి. అంతే కాకుండా ఇప్పటివరకున్న పలు ఔషధ కాంట్రాక్టులను కూడా చైనా డ్రగ్ సప్లయర్లు రద్దు చేశారు.



చైనా డ్రగ్ ముడిసరుకు సరపరాపై నియంత్రణ పెంచటమే కాదు ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచేసింది అంతేకాదు ఇంతకు  ముందున్న సరపరా కాంట్రాక్టులను రద్ధు చేసింది.


* ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు

* వెంటిలేటర్లు 

* బల్క్-డ్రగ్స్

* కోవిడ్-19 చికిత్సలో వాడే ఉపకరణాలు

* ఔషధాలు



ఉదాహరణకు 10 లీటర్ల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల సగటు ధర 200 డాలర్ల నుంచి 1000 డాలర్లకు పెరిగింది. కరోనా కష్టకాలంలో చైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం శోఛనీయమని చెప్పాలి. కరోనాని అన్ని దేశాలకు అంటించి.. ఇప్పుడు చైనా చోద్యం చూస్తున్నట్లు ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ప్ర‌పంచం మొత్తం ఇలాంటి ఆర్ధిక సామాజిక రాజకీయ దారుణ సంక్షోభాల‌ను ఎదుర్కొంటున్న వేళ చైనా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించటం అన్యాయం.


   

మరింత సమాచారం తెలుసుకోండి: