
తెలంగాణ రాష్ట్రంలో నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్, అర్హులైన అభ్యర్ధులకు సభ్యత్వం కల్పనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విస్తృతంగా చర్చించారు. 404 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసి 1 లక్షా 14 వేల 845 మంది మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా సభ్యత్వాలు కల్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేసిన 33 కులాల్లో మాత్రమే ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి మత్స్యకారులకు సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు ఇచ్చారు.
జీవో 6 ప్రకారం వర్షాభావ ప్రాంతాల్లో 2 ఎకరాలకు 1 సభ్యత్వం, నీటి పారుదల ప్రాంతాల్లో 1 ఎకరానికి ఒక సభ్యత్వం చొప్పున ఇవ్వాలని స్పష్టం చేశారు. కొత్తగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయాలంటే కనీసం 11 మంది సభ్యులు అవసరమవుతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటికే ఉన్న పాత సహకార సంఘాల్లో 3.56 లక్షల మంది సభ్యులు ఉండగా... కొత్తగా వచ్చే సభ్యులతో కలిపి 5 లక్షల వరకు ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పెద్ద ఎత్తున మత్స్య సంపద పెరిగిన దృష్ట్యా మత్స్యకారులకు మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సొసైటీల్లో సభ్యత్వాల నమోదులో అక్రమాలకు పాల్పడితే మాత్రం సంబంధించి అధికారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.