
అమెరికాకు సంబంధించిన సారోస్ గ్రూప్ చేసే గేమ్స్ లో భాగంగా నెతన్యాహును పక్కన పెట్టే పనిలో సక్సెస్ అయ్యారు. 18 ఏళ్లుగా ఉన్న నెతన్యాహును పక్కనపెట్టి కమ్యూనిస్టు ఐడియాలజిస్టులను అక్కడ పెట్టారు. దాని పర్యావసనమే ఏడాదిన్నర నుండి అమెరికా వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్లిపోయింది. నెతన్యాహుకు ఇప్పటికీ కూడా అమెరికాతో స్నేహం ఉంది కానీ అమెరికాకి బానిసత్వం చేయడు. ఆయనకు ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. అంతేకాకుండా ఆయన రైట్ వింగ్ వైపుకి వెళ్ళిపోయాడు కాబట్టి అమెరికా ఇష్టం వచ్చినట్లు నడిచే అవకాశం ఉండదు.
అమెరికా ఇప్పుడు పాలస్తీనా జోలికి వెళ్ళద్దంటుంది. కానీ అదే పాలిస్తానా తాట తీస్తున్నాడు ఆయన. సిరియా జోలికి వెళ్ళొద్దంటున్నారు అమెరికా ఇంకా యూరప్ దేశాలు. కానీ వాళ్ళు చెప్పిన సిరియా దేశాన్ని కుప్ప కూల్చి వచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయిల్ భారతదేశం గురించి స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. వాళ్ళు మాట్లాడుతూ భారత్ తమ సన్నిహిత దేశమని, రాబోయే రోజుల్లో సూపర్ పవర్ గా మారబోయే అవకాశం ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందనే విషయాన్ని తేల్చి చెప్పింది ఇజ్రాయిల్.
భారతదేశానికి ఇజ్రాయిల్ వాళ్ళతో ఒక పక్క మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఇంకా సాంస్కృతిక బంధం కూడా బలంగానే ఉంది. ఇజ్రాయిల్ ఇంకా భారతదేశం తమకు చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకుంది అంటే అది భారత్ దయా గుణం, సేవాగుణం వల్లే.