ప్రపంచమంతటా రూపాయి విలువ పెంచుకునే దిశగా, అలాగే విదేశీ మారక విలువలు కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నది భారత దేశం. రష్యా ఇంకా ఇటలీ తాజాగా భారత్ రూపాయితో వ్యాపారానికి రెడీ అవుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ రూపాయిల్లోనే జరుపుకోవాలని రష్యా ఇంకా శ్రీలంక 2022 లోనే మొట్టమొదటిసారిగా ఒప్పందం చేసుకున్నారు. మొన్న బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకున్నారు ఆర్బిఐలో.



తర్వాత మారిషస్, మలేషియా, ఇజ్రాయిల్, జర్మనీ, సింగపూర్ మయన్మార్ ఇవన్నీ కూడా స్పెషల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా తెరిచారు. వాటిని వాస్ట్రో అకౌంట్ అంటారు. వాస్ట్రో అనేది లాటిన్ భాషకు సంబంధించిన పదం. యువర్స్ అనే అర్థంలో తెలుగులో నీది అనే అర్థం వస్తుంది. వేరే దేశం బ్యాంకు తో కలిపి ఈ ఒప్పందం చేసుకుంటారు. ఉదాహరణకి ఇక్కడ మన దేశంలోని బ్యాంకుల్లోకి వాళ్ళు రూపాయిల్లో వేస్తే, మనం వాళ్ళ దగ్గర కొన్నప్పుడు వాళ్ళ డబ్బులు వేస్తాం. వాళ్ల వాళ్ల దేశాల కరెన్సీలో, డబ్బులు డిపాజిట్ డిపాజిట్ చేస్తాం అన్నమాట.



దీని ద్వారా విదేశీ మారక నిల్వలని కాపాడుకోవచ్చు. రెండవది వ్యాపార వాణిజ్య సంబంధాలు పెంచుకోవచ్చు. డాలర్ మీద ఆధారపడే తత్వం కూడా తగ్గుతుంది. ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుండే మోడీ సర్కార్ ని కుప్ప కూల్చడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. అదానీ గొడవైనా, హిండెన్ బర్గ్ గొడవైనా, సోరోస్ ఓపెన్ స్టేట్మెంట్ అయినా ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి సిక్ ఫర్ జస్టిస్ వాళ్లు రెచ్చిపోతున్నా సరే వీటన్నిటి వెనకాల డాలర్ కి దెబ్బ తెచ్చిన అంశమే ఉంది.



డాలర్ కి దెబ్బ వచ్చే ప్రతిసారి అమెరికా మిగిలిన దేశాలన్నింటినీ నాశనం చేస్తుంది లేదా భయపెడుతుంది. అట్లా ఇంతకుముందు ఇరాక్ ని, లిబియా ను, సౌదీ ని నాశనం చేసింది. అలాంటి దశలో ఇప్పుడు భారతదేశ మీద ఎలాంటి కుట్రలు చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: