
కానీ 14 సంవత్సరాలు సీఎం గా పనిచేసిన చంద్రబాబు నాయుడు అతని కుటుంబం మచ్చ లేకుండా ఉందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించి, దేశంలోని అన్ని రాజకీయ శక్తుల్ని ఏకం చేయాలని కంకణం కట్టుకుని తిరిగారు. కానీ ఒక్క కేసులో కూడా బాబును ఇరికించలేకపోయారు. అంతటి మచ్చలేని నాయకుడు బాబుని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నాయి.
కేసులు పెట్టలేకపోయారు కావచ్చు. కానీ చంద్రబాబు అధికారాన్ని దూరం చేయడంలో కేంద్రంలోని బీజేపీ పని చేసింది తెలుగు తమ్ముళ్లు మరిచిపోయారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న విషయం తెలియనట్లుంది. మరి అంతలా అభివృద్ది చేసి ప్రజల మన్ననలు పొందిన నాయకుడు, మీడియాను గుప్పెట్లో పెట్టుకున్న నేత 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు. అవినీతి మరకలు లేకపోవచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్న ఎవరైనా ప్రజా క్షేత్రంలో ఓడిపోవాల్సిందే. బీజేపీ, టీడీపీ, వైసీపీ ఏ పార్టీ నుంచైనా సరే ఎంతటి దిగ్గజ అభ్యర్థులైనా సరే ప్రజలు డిసైడ్ చేస్తారు.
కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ పార్టీ కా పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. మా నాయకుడు గొప్ప అంటే లేదు మా నాయకుడు తోపు అనుకుంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఏం జరిగింది మరిచిపోయి.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుంటూ ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తల బలం ఉంటేనే ఏ పార్టీ నాయకుడైనా దృడంగా తయారవుతారనడంలో సందేహం లేదు.