పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో గాని స్టేట్మెంట్లు ఎవ్వరు. ఏదైనా గట్టిగా స్పందించాల్సిన విషయం వస్తేనే తప్ప స్పందించరు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై కూడా ఇలాంటి ఒక చిన్న విమర్శ ఉంది. మోడీని కలుస్తారు, మాట్లాడుతారు కానీ ఏం మాట్లాడారో అనేది త్వరగా చెప్పరు.


పాత విషయాలను కూడా తర్వాత ఎప్పుడో పాత విషయాన్ని కొత్త డేట్ తో స్టేట్మెంట్ ఇస్తుంటారు అని ఒక విమర్శ ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ మురళీధరన్ ని రెండోసారి కలిసినా ఆయన ఏం మాట్లాడారో మాత్రం చెప్పలేదు. అదే సందర్భంలో ఒక ప్రచారం ఏమో కర్ణాటక ఎన్నికల కోసం వాళ్లే ఆయన్ని పిలిపించారు అని, ఇంకొక ప్రచారమేమో ఈ పొత్తుల సంగతి తేల్చండి అని ఈయనే వెళ్లారని, రాష్ట్ర నాయకత్వం మార్పు కోసం ఈయనే అడగడానికి వెళ్లారని, అలాగే పొత్తుల కోసం, టిడిపితో పొత్తుల కోసం అధిష్టాన్ని ఒప్పించడం కోసం మురళీధరన్ ని కన్విన్స్ చేయడానికి ఈయన వెళ్లారని రకరకాల ప్రచారాలు జరిగాయి.


పవన్ కళ్యాణ్ టూర్ అయ్యాక మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. ముందు మురళీధరన్ ని, ఆ తర్వాత గజేంద్రసింగ్ షెకావత్ ని ఆయన కలిశారు. ఫైనల్ గా ఈ కథ అంతా అయిపోయాక ఆయన చెప్పే ఆన్సర్ ఏ ఉద్దేశంతో ఢిల్లీ వెళ్లారు, పిలిస్తే వెళ్లారా ఆయనే వెళ్లి బిజెపిని కలిసారా, బిజెపితో బంధం ఉన్నట్టా, లేనట్టా? తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తాయా లేదా జనసేన బిజెపి కలిసి ప్రయాణం చేస్తాయా? ఏంటి అనేది ఇక తేలాల్సి ఉంది.


అయితే పవన్ కళ్యాణ్  టూర్ గురించి జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్  ఆయన ఎందుకు వెళ్లారు అన్నదాని గురించి చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ద్వారా వినాలని ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: