మొన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజలకు ఏకైక దిక్కు గులాబీ జెండా అని ఆయన చెప్పడం జరిగింది. సరే మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను బట్టి చూస్తే  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కానీ, అది సెంటిమెంట్  దానికి మించిన ఇతర ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. కానీ వాటిని చేయవలసింది ప్రధాని నరేంద్ర మోడీ కాదని, హరీష్ రావు గారి మామగారు, మేనమామ అయిన కేసిఆర్ గారని జనాలు అంటున్నారు.


రాయలసీమ ఎత్తిపోతల పథకం పై అబ్జెక్షన్ ఉపసంహరించుకోవాలని, అది ఆంధ్ర కోసమే వినియోగించాల్సిన నీరు కాబట్టి ఉపసంహరించుకోవాలని, అలానే ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పోలవరం మీద అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని, అలాగే ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పోతిరెడ్డిపాడు పై కంప్లైంట్ ని ఆపేయాలని, అలానే ఇప్పుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దగ్గర ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని కొనసాగించాలని వాళ్లు అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ కోసం రావాల్సిన నీళ్లు కదా అవి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఆస్తులు అంతకు ముందు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి సందర్భంలో అంతకుముందే ఫిక్స్ చేసుకున్న ఆస్తులు సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలకు సంబంధించిన ఆస్తులు లక్ష40 వేల కోట్ల నుండి లక్ష 60వేల కోట్ల వరకు ఉన్నాయి. ఒక 30వేల మొత్తాన్ని తీసేసిన ఇంకా లక్ష 30 వేల కోట్లు ఉంటాయి.


ఆ ఆస్తులు అన్ని ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేయాలి. లేదా ఆ ల్యాండ్స్ అయినా ఇచ్చేయాలని, ఆంధ్రప్రదేశ్ మెయింటెన్ చేసుకుంటుందని, లేదంటే అమ్ముకుంటుందని వాళ్ళు అంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆస్తులు విభజన ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఎలక్ట్రిసిటీ బోర్డు వరకు ఉన్నదంతా ఇచ్చేయాలని అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ నుండి తీసుకువెళ్లి తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లను కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటే కెసిఆర్ ని అందరూ అభిమానిస్తారని వాళ్ళు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR