తెలుగు సినిమాలు ప్రస్తుతం హిందీలో కూడా బాగా విజయాలను అందుకుంటున్నాయి. బాహుబలి-1,-2 ,RRR, సాహో వంటి చిత్రాలు ఉత్తరాది నుంచి మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఇందులో బాహుబలి సినిమా తప్ప మరే ఇతర సినిమాలు ఆశించిన స్థాయిలో తమిళంలో ఆకట్టుకోలేకపోయాయి. ఇందుకు కారణం ఏమిటి అంటే.. అక్కడ ప్రేక్షకులు సైతం యూనిట్ గా ఉండడం. కేవలం తమ హీరోల సినిమాలను తప్ప ఇతర భాషల నుంచి వచ్చిన సినిమాలను పెద్దగా చూసేందుకు ఇష్టపడ్డారు. ప్రాంతీయ అభిమానం లో వీరికి వీరే సాటి అని చెప్పవచ్చు. ఈ విషయం పలు సార్లు నిరూపణ అయ్యింది.


తెలుగు నుంచి ఎంత పెద్ద హీరో సినిమా విడుదలైన సరే తమిళ్ లో ఆ సినిమాను తిరస్కరిస్తూ ఉంటారు. అయితే కేవలం బాహుబలి సినిమా తప్ప తమిళ ఆడియో నుంచి ఇప్పటివరకూ వందకోట్ల కలెక్షన్స్ చేసిన సినిమాలు ఏవీ లేవు. కానీ ఆ తరవాత ఏ తెలుగు సినిమా అక్కడ అంతగా ఆడలేదు. ఇక మన హీరోలను మాత్రం అక్కడ ఎంకరేజ్ చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపరు. అయితే కానీ మహేష్ బాబుకు మాత్రం ఒక అరుదైన అవకాశం దక్కింది.


తెలుగు హీరోల లో అంతో ఇంతో మహేష బాబు కి తమిళంలో ఆదరణ ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. ఈసారి మహేష్ బాబు నటించిన సినిమా కి 4AM షో కి అనుమతించడంతో తెలుగు హీరోలు సైతం తమిళంలో ఇదే మొదటి సారి ఇలా ఫ్యాన్స్ షో వేయడం. అయితే ఇందుకు కారణం ఏమిటంటే మహేష్ బాబును ఇష్టపడే అభిమానులు సైతం తమిళ లో ఉన్నారని చెప్పవచ్చు. చెన్నైలో రోహిణి సిల్వర్ స్క్రీన్ పై ఈ స్పెషల్ షో ఉండనుంది. మొదటిసారి మహేష్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. మహేష్ బాబు చెన్నై లో స్థిరపడిన తెలుగువారు కావడం వల్లే ఇలా అభిమానం పెరిగిందని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: